CM KCR : ఈసారి కూడా సేమ్ సీన్.. ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం, కారణం ఏంటంటే..

CM KCR : ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న హైదరాబాద్ కు రానున్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ టూర్ లో భాగంగా..

CM KCR : ఈసారి కూడా సేమ్ సీన్.. ప్రధాని మోదీ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం, కారణం ఏంటంటే..

CM KCR

CM KCR : ప్రధాని నరేంద్ర మోదీ రేపు(ఏప్రిల్ 8) హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. అధికారిక పర్యటన కావడం, తెలంగాణలో అభివృద్ధి పనుల ప్రారంభోత్స కార్యక్రమాలు ఉండటంతో మోదీ టూర్ లో పాల్గొనాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాదు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే పబ్లిక్ మీటింగ్ లో సీఎం కేసీఆర్ మాట్లాడేందుకు 7 నిమిషాల సమయం కూడా కేటాయించింది. కానీ, సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయించారు.

Also Read..Bandi Sanjay: టీఎస్‌పీఎస్‌సీ లీకేజీని పక్కదారి పట్టించేందుకే ఈ కుట్రలు.. జైలు నుంచి విడుదలైన బండి సంజయ్

కరోనా సమయంలో జీనోమ్ వ్యాలీకి ప్రధాని వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించకుండా ప్రోటోకాల్ ను పాటించలేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కానీ, ఆ తర్వాత ప్రోటోకాల్ ప్రకారం పీఎంవో ఆహ్వానం పంపినా.. ఏ కార్యక్రమానికి కూడా సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. ఈసారి కూడా సీఎం కేసీఆర్.. ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనబోరని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటించారు.(CM KCR)

Also Read..Mallu Batti Vikramarka : తెలంగాణకు కేటాయించిన పథకాలు, ప్రాజెక్టుల వివరాలు చెప్పగలరా?.. ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించిన మల్లు భట్టి విక్రమార్క

కోవిడ్ సమయంలో హైదరాబాద్ కు వచ్చిన ప్రధాని మోదీ.. సీఎం కేసీఆర్ ను ఆహ్వానించకుండా ప్రధాని మోదీ ఒక్కరే వచ్చి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారని, అందుకే తాము ఇప్పుడు వెళ్లటం లేదన్నారు. ”ప్రధాని మోదీ పర్యటన సమయంలో ప్రోటో కాల్ పాటించలేదు. సీఎం కేసీఆర్ ను అవమానపరిచారు. రాజ్యాంగబద్దంగా ఉన్న చీఫ్ మినిస్టర్ హోదాని చులకనగా చూశారు.

Also Read..PM Modi: 8న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ .. షెడ్యూల్ ఇలా..

ఆయన ఒక్కడే వస్తారు. ఒక్కడే పోతారు. ఆ బాట చూపించింది ఆయనే. ఆ రోజు కేసీఆర్ వస్తాను అంటే ప్రధాని మోదీ వద్దన్నారు. ఎవరూ రావొద్దని చెప్పి పంపారు. కోవిడ్ సమయంలో నేను ఒక్కడినే వస్తా, ఒక్కడినే చూస్తా, ఒక్కడినే పోతా అన్నారు. ఆ రోజు అంత అహంకారం ఎందుకు చూపారు? ” అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఫైర్ అయ్యారు.

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న హైదరాబాద్ కు రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. హైదరాబాద్ టూర్ లో భాగంగా సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్ లో వివిధ ప్రారంభోత్సవాలు, ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించి తిరుగు పయనం అవుతారు.(CM KCR)

బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ జరుగుతోంది. అటు ఢిల్లీ లిక్కర్ కేసు, ఇటు టెన్త్ పేపర్ లీకేజీ కేసు.. ఇరు పార్టీల మధ్య చిచ్చు రాజేశాయి. టెన్త్ పేపర్ లీక్ కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను అరెస్ట్ చేయడం.. రాజకీయవర్గాల్లో దుమారం రేపింది. ఈ క్రమంలో బహిరంగ సభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడతారు? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.