PM Modi: 8న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ .. షెడ్యూల్ ఇలా..

ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైల్వేను ప్రారంభిస్తారు. అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు.

PM Modi: 8న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ .. షెడ్యూల్ ఇలా..

PM Modi

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 8న ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ కు చేరుకోనున్న ప్రధాని మోదీ 1.30గంటల వరకు ఇక్కడే ఉంటారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా.. మోదీ సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభిస్తారు. పరేడ్ గ్రౌండ్ చేరుకొని అక్కడ వివిధ ప్రారంభోత్సవాలు, ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించి తిరుగు పయణం అవుతారు.

PM Modi: అవినీతిలో కూరుకుపోయినవారందరూ ఒకే వేదికపైకి వస్తున్నారు: విపక్షాలపై మోదీ విసుర్లు

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ రణరంగం కొనసాగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య నువ్వానేనా అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా టెన్త్ ప్రశ్న పత్రాల లీకేజీ విషయంపై పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేశారు. లీకేజీ కుట్రదారు సంజయ్ అంటూ అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య బుధవారం హనుమకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు సంజయ్ ను హాజరుపర్చగా.. 14 రోజులు రిమాండు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. దీంతో రాజకీయంగా ఉద్రిక్తత వాతావరణంనెలకొంది.

Bandi Sanjay: పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్.. వాహనంపై రాళ్లు, చెప్పులు విసిరిన బీఆర్ఎస్ కార్యకర్తలు

బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో ప్రధాని మోదీ హైదరాబాద్ రానుండటం, బహిరంగ సభలో పాల్గోనుండటంతో.. ప్రధాని ఏం మాట్లాడతారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ప్రధాని మోదీ అధికారిక పర్యటనకు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అయితే, కేసీఆర్ ప్రధాని మోదీ టూర్‌లో పాల్గొంటారా? లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. ప్రస్తుతం కూడా అదేవిధానాన్ని అనుసరిస్తారన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతుంది.

Bandi Sanjay Arrest: బండి సంజయ్‪కు 2 వారాల రిమాండ్.. జైలుకి తరలింపు

ప్రధాని మోదీ షెడ్యూల్ ఇలా..

11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.

11.45 నుంచి 12.00 గంటల వరకు సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైలును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.

12.15గంటలకు పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు.

12.18 నుంచి 1.20 గంటల వరకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, వివిధ ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు.

1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుండి తిరుగుప్రయాణం అవుతారు.