CM KCR  warangal tour cancelled : కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు..

కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు అయ్యింది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో నవంబర్ 10,11 తేదీల్లో  పర్యటించాలని సీఎం కేసీఆర్ పర్యటించనుండగా అనూహ్యంగా పర్యటన రద్దు అయ్యింది.

CM KCR  warangal tour cancelled : కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు..

Telangana Cm Kcr Warangal Tour Cancelled

CM KCR  warangal tour cancelled :  ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో సీఎం కేసీఆర్ వరంగల్ నగర పర్యటన రద్దయింది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో నవంబర్ 10,11 తేదీల్లో  పర్యటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సీఎం సభకు అధికారులు ఏర్పాట్లు చేసారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమల్లోకి రావడంతో సీఎం పర్యటన రద్దయింది. ఈనెల 29న జరగనున్న విజయగర్జన సభ సభపై సందిగ్దం ఏర్పడింది.సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ పర్యటన రద్దయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కేసీఆర్ పర్యటన రద్దు చేసుకున్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి.

Read more : Election Code : తెలంగాణ‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల కోడ్ అమ‌లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన హఠాత్తుగా రద్దు అయ్యింది.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో కేసీఆర్ పర్యటన రద్దు చేసుకున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించాయి. బుధ, గురువారాల్లో (నవంబర్ 10,11) రెండు రోజుల పాటు సీఎం కేసీఆర్ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటిస్తారని సీఎంవో వర్గాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధికారులు కేసీఆర్ పర్యటనకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆ జిల్లాల ప్రజా ప్రతినిధుల అభివృద్ధి కావాల్సిన కార్యక్రమాల లిస్టును సీఎంకు ఇవ్వటానికి అన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రజలు కూడా సీఎం కేసీఆర్ రాకకు ఎంతగా ఎదురు చూశారు. తమ సమస్యలు చెప్పుకుందామని ఆశపడ్డారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టటానికి సీఎం భావించారు. కానీ అనూహ్యంగా పర్యటన రద్దు అయ్యింది.

Read more : Pak CJ Gulzar Ahmed : పాకిస్థాన్ లోని హిందువులకు అండగా ఉంటాం : పాక్ ప్రధాన న్యాయమూర్తి

కేసీఆర్ తమ జిల్లాకు వస్తున్నారని ఎంతో ఆశగా చూసిన అధికారులు, టీఆర్ఎస్ నేతలకు ఒక్కసారిగా నిరుత్సాహపడినట్లుగా అయ్యింది. మంగళవారం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేకపోవడంతో కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకునట్లు తెలుస్తోంది.సీఎం కేసీఆర్ పర్యటన రద్దుతో వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పలు ప్రభుత్వ అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈనెల 29న జరగనున్న విజయగర్జన సభను టీఆర్ఎస్ వాయిదా వేసింది.