Telangana : టి.కాంగ్రెస్ శాసనసభాపక్షం అత్యవసర భేటీ..ఎందుకో

సీఎల్పీ భేటీ ద్వారా పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు...

Telangana : టి.కాంగ్రెస్ శాసనసభాపక్షం అత్యవసర భేటీ..ఎందుకో

T.congress

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్షం అత్యవసరంగా భేటీ కానుంది. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలపై చర్చించాలని నిర్ణయించింది. అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ ఆఫీసులో 2022, జనవరి 09వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు కాంగ్రెస్‌ శాసనసభాపక్షం నేతలు సమావేశం కానున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరికీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించాలని నిర్ణయించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవతో పాటు రైతుల సమస్యలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

Read More : Viral News: కరోనా సోకిన కుమారుడిని కారు డిక్కీలో ఇరికించిన తల్లి, చివరకు అరెస్ట్

అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న తీరుపై కూడా చర్చించాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ శిక్షణా తరగతులను కోవిడ్ నిబంధనల మేరకు నిర్వహిస్తామన్నా.. తెలంగాణ ప్రభుత్వం అనుమతించడం లేదంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. అయితే ఆర్ఎస్ఎస్ సమావేశాలకు అనుమతులు ఇవ్వడం.. బీజేపీ జాతీయ నేతలు వచ్చి సభలు నిర్వహిస్తున్న పట్టనట్లు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు.

Read More : Ramesh Babu: కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతిపై పవన్ కళ్యాణ్ సంతాపం

ఈ అంశాలపై భేటీలో చర్చించాలని భావిస్తున్నారు. అలాగే రైతాంగం సమస్యలు.. కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో పేదలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను చర్చించాలని నిర్ణయించారు. సీఎల్పీ భేటీ ద్వారా పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.