Telangana Devudu : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు – ‘తెలంగాణ దేవుడు’ మూవీ టీమ్..

1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రజల కష్టాలను తీర్చిన ఒక మహానీయుని జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’..

Telangana Devudu : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు – ‘తెలంగాణ దేవుడు’ మూవీ టీమ్..

Telangana Devudu

Telangana Devudu: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపింది ‘తెలంగాణ దేవుడు’ చిత్ర టీమ్. 1969 నుండి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలోని పరిస్థితులను చూసి చలించి ఉద్యమాన్ని ముందుకు నడిపించి ప్రజల కష్టాలను తీర్చిన ఒక మహానీయుని జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. తెలంగాణ ఉద్యమం భావి తరాలకు ఒక నిఘంటువు. అటువంటి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉద్యమనాయకుని చరిత్ర అందరికీ తెలియాలనే.. ‘తెలంగాణ దేవుడు’ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు దర్శక నిర్మాతలు.

వడత్య హరీష్ దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్ జాకీర్ ఉస్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉద్యమనాయకుడి పాత్రలో ఫ్రెండ్లీ స్టార్‌ శ్రీకాంత్‌ నటించగా.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. సంగీత, బ్రహ్మానందం, సునీల్‌, సుమన్‌, తనికెళ్ల భరణి వంటి 50 మంది అగ్ర నటీనటులు నటించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గి.. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనగానే చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకనిర్మాతలు తెలుపుతున్నారు.

Telangana Devudu

ఈ సందర్భంగా దర్శకుడు హరీష్‌ వడత్యా మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ‘తెలంగాణ దేవుడు’ వంటి గొప్ప చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత జాకీర్ ఉస్మాన్ గారికి, చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము..’’ అని తెలిపారు.

చిత్ర నిర్మాత మహ్మద్ జాకీర్ ఉస్మాన్ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలకు ఈ రోజు ఎంతో విశిష్టమైనది. తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో ప్రాణ త్యాగాలు చేశారు. వారందరి త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం. ముఖ్యమంత్రి కేసీఆర్‌గారి బయోపిక్‌గా రూపుదిద్దుకున్న మా ‘తెలంగాణ దేవుడు’ చిత్రంలో.. తెలంగాణ ఆవిర్భావానికి ముందు ఏం జరిగిందనే అంశాలను కళ్లకు కట్టినట్లు చూపించాం. ఇది ఓ మహనీయుని చరిత్ర. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుత పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ‘తెలంగాణ దేవుడు’ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకువస్తాము. ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ.. క్షేమంగా ఉండాలని మా చిత్ర యూనిట్ తరపున కోరుతున్నాము..’’ అని అన్నారు.

Telangana Devudu

ఫ్రెండ్లీ హీరో శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్‌స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు.. మూల కథ, నిర్మాత: మహ్మద్ జాకీర్ ఉస్మాన్
రచన, దర్శకత్వం: వడత్యా హరీష్
మ్యూజిక్: నందన్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్: గౌతంరాజు
లైన్ ప్రొడ్యూసర్: మహ్మద్ ఖాన్
మాక్స్‌ల్యాబ్ సిఈఓ: మహ్మద్ ఇంతెహాజ్‌ అహ్మద్‌..