Midwifery in Govt Hospitals : నార్మల్ డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణిలకు వ్యాయామం

నార్మల్ డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణిలకు వ్యాయామం చేయిస్తున్నారు సిబ్బంది. ‘మిడ్ వైఫరీ’ శిక్షణ ద్వారా సాధారణ ప్రసవాలు జరిగేలా చేస్తున్నారు.

Midwifery in Govt Hospitals : నార్మల్ డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణిలకు వ్యాయామం

Midwifery In Govt Hospitals

Midwifery in Telangana Govt Hospitals: ఈరోజుల్లో అన్ని సిజేరియన్ సర్జరీ ప్రసవాలే. సాధారణం ప్రసవం అనే మాటే వినిపించట్లేదు. ఈ క్రమంలో ‘కోత’ల్ని తగ్గించాలని సాధారణ ప్రసవాలను పెంచాలని తెలంగాణ గవర్నమెంట్ భావించింది. దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది.దీంట్లో భాగంగానే తెలంగాణలోని ప్రభుత్వాస్పత్రుల్లో ‘మిడ్ వైఫరీ’ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది. సాధారణ కాన్పులపై అవగాహనే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని స్టాఫ్ నర్సులకు ‘మిడ్ వైఫరీ’ శిక్షణ ఇస్తోంది ప్రభుత్వం. ఈ శిక్షణలో భాగంగా నార్మల్ డెలివరీ..

సాధారణ కాన్పులపై అవగాహనే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని స్టాఫ్ నర్సులకు ‘మిడ్ వైఫరీ’ శిక్షణ ఇస్తోంది ప్రభుత్వం. ఈ శిక్షణలో భాగంగా నార్మల్ డెలివరీ కోసం గర్భిణి స్త్రీలతో వ్యాయామం చేయిస్తున్నారు నర్సు అమ్మలు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇటువంటి ‘మిడ్ వైఫరీ’ శిక్షణ అమల్లో ఉంది. ఈ పద్ధతిని తెలంగాణలో కూడా ప్రవేశ పెట్టాలని తద్వారా సాధారణ ప్రసవాలు జరిగేలా చేయాలని ప్రభుత్వం భావించింది. దీంతో ఈ విధానం అమలుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఫైలెట్ ప్రాజెక్ట్ కింద ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్, సంగారెడ్డి ఆస్పత్రులు ఎంపిక చేశారు.

Read more :  అమ్మ పొట్టకు కోత తప్పడం లేదు..సిజేరియన్‌ చేకుండా కాన్పు చేయటం లేదు

పురిటి నొప్పులతో బాధపడుతు బిడ్డలకు జన్మనించే తల్లుల కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణిలతో వ్యాయామాలు చేయించనున్నారు. మాతృమూర్తికి ప్రసవ వేదన తగ్గించాలని సాధారణ ప్రసవంతోనేబిడ్డలు ఈ భూమ్మీదకు రావాలని..ఇలా వినూత్న తరహాలో ప్రసవాలు చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. సంగరెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రితో పాటు గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సాధారణ ప్రసవాలు జరిగేలా చేస్తున్నారు.

అమ్మతనం దేవుడిచ్చిన గొప్పవరం. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడంతో పాటు సదరు గర్భిణి కూడా తీవ్రమైన ప్రసవవేదన అనుభవిస్తు పునర్జన్మ పొందుతుంది. అటువంటి సమయంలో ప్రసవ సమయంలో ఎటువంటి సమస్యలు రాకుండా..గర్భిణి వేదన తగ్గించటానికి ఈ మిడ్ వైఫరీ శిక్షణ..ఉపయోగపడతుంది. సాధారణ ప్రసవం ద్వారా బిడ్డను కంటుంది. అందకే గర్భిణులకు చిన్న, చిన్న వ్యాయామాలు (మిడ్ వైఫరీ శిక్షణ..)చేయిస్తూ సిజేరియన్ అవసరమే లేకుండా..సాధారణ ప్రసవాలు కలిగే విధంగా ప్రోత్సహిస్తున్నారు ఆయా ఆసుపత్రుల సిబ్బంది.

Read more :  బెంగళూరులో భయానకం.. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు, నర్సుల తీవ్ర కొరత

సాధారణ ప్రసవాలు జరగడానికి..ప్రసవానికి సిద్ధంగా ఉన్న మహిళలకు వ్యాయామాలు నేర్పిస్తున్నారు ఆస్పత్రి సిబ్బంది. మిడ్ వైఫరీ శిక్షణ తీసుకున్న నర్సులు, గర్భిణీ స్త్రీల చేత బాల్ ఎక్సర్సైజ్, వాకింగ్ ఎక్సర్సైజ్, సిట్టింగ్ లాంటి చిన్న, చిన్న వ్యాయమలు చేయిస్తు వారిని సిజేరియన్ కు దూరం చేస్తూ, సాధారణ ప్రసవాలకు దగ్గరచేస్తు..శారీరకంగా..మానసికంగా సిద్ధం చేస్తారు. ఇప్పటికే జిల్లాలోనే అధిక నార్మల్ డెలివరీలు చేస్తున్న ఘనత సంగరెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిదే కావటం విశేషం.