అమ్మ కడుపుకు కోత తప్పడం లేదు..సిజేరియన్‌ చేకుండా కాన్పు చేయటం లేదు | Telangana

అమ్మ పొట్టకు కోత తప్పడం లేదు..సిజేరియన్‌ చేకుండా కాన్పు చేయటం లేదు

అమ్మ పొట్టకు కోత తప్పడం లేదు..సిజేరియన్‌ చేకుండా కాన్పు చేయటం లేదు

Telangana : National family health survey says about cesarean : అమ్మ పొట్టలో రూపుదిద్దుకున్న పసిగుడ్డు ఈ లోకంలోకి రావాలంటే ఆ తల్లి పురిటినొప్పులు భరిస్తేగానీ బిడ్డ పుట్టేదికాదు. కానీ ఇప్పుడలా కాదు. అమ్మ పొట్ట కోయకుండా బిడ్డ పుట్టటంలేదు. దీంతో అమ్మ పొట్టకు కోత తప్పడం లేదు. సిజేరియన్‌ లేకుండా డాక్టర్లు బిడ్డను బయటకు తీయడంలేదు. రోజు రోజుకు సాధారణ ప్రసవాలు తగ్గిపోతున్నాయి. సిజేరియన్ ఆపరేషన్లు పెరుగుతున్నాయి.

సిజేరియన్ ఆపరేషన్ల గురించి తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటూ అత్యధికంగా కరీంనగర్‌ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయని సర్వేల్లో తేలింది. గర్భిణి ప్రసవం కోసం హాస్పిటల్ లో జాయిన్అయితే ఆమెకు పురిటినొప్పులు వచ్చినా..సాధారణ ప్రసవం చేయటానికి డాక్టర్లు వేచి చూడటంలేదు. ప్రసవం ఆలస్యం అవుతోంది. బిడ్డకు ప్రమాదం జరగొచ్చు అని చెప్పి వెంటనే కోతకు రెడీ చేసేస్తున్నాడు డాక్టర్లు. దీంతో భయపడిపోయి సిజేరియన్ ఆపరేషన్ కు సిద్ధపడిపోవవాల్సి వస్తోంది. లేదంటే నవమాసాలు మోసిన బిడ్డ ఒడిలోకి రాకుండా దూరమైపోతుందనే భయం.

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య ఏస్థాయిలో ఉందంటే ఏకంగా 82.4 శాతం మంది తల్లులకు కడుపుకోతలు తప్పటంలేదు.అదేనండీ సిజేరియన్‌ ఆపరేషన్లు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ఈ వివరాలను తెలిపింది.

తెలంగాణలో 31 జిల్లాల వారీగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివరాలను వెల్లడించింది. అత్యంత ఎక్కువ సంఖ్యలో కరీంనగర్ జిల్లాలో 82.4 శాతం సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతుండగా..కొమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తక్కువగా అంటే 27.2 శాతం సిజేరియన్లు ఉన్నాయని సర్వే తెలిపింది.

ఇక ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అయితే..కరీంనగర్‌ జిల్లాలో ఏకంగా 92.8 శాతం సిజేరియన్‌ ద్వారానే బిడ్డను బయటకు తీస్తున్నారు. ఈ జిల్లా తరువాత జోగులాంబ గద్వాల జిల్లా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 65.8 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్లు అత్యధికంగా జనగామ జిల్లాలో 73 శాతం జరుగుతుండగా, అత్యంత తక్కువగా కొమురంభీం ఆసిఫాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16.6 శాతం జరుగుతున్నాయని సర్వేలో వెల్లడైంది.

×