కేసీఆర్ ఆదేశిస్తే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొంటాం : మంత్రి కేటీఆర్

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కానివ్వబోమని చెప్పారు. విశాఖ ఉద్యమానికి అండగా ఉంటామని తెలిపారు. కేసీఆర్ ఆదేశిస్తే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొంటామని పేర్కొన్నారు.

కేసీఆర్ ఆదేశిస్తే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొంటాం : మంత్రి కేటీఆర్

Vizag steel plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కానివ్వబోమని చెప్పారు. విశాఖ ఉద్యమానికి అండగా ఉంటామని తెలిపారు. కేసీఆర్ ఆదేశిస్తే విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొంటామని పేర్కొన్నారు. ఈరోజు ఏపీలో అమ్ముతున్నారు..రేపు తెలంగాణలో అమ్మడం మొదలుపెడతారని తెలిపారు.

కేంద్రం వైఖరికి నిరసనగా అవసరమైతే విశాఖలో పోరాటం చేస్తామని చెప్పారు. కేంద్రం వైఖరికి నిరసనగా అందరూ పోరాడాలని పిలుపిచ్చారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకుని ఉద్యమానికి ప్రత్యక్ష మద్దతు తెలుపుతామని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరిస్తే తమకు సంబంధం ఏంటి అనుకోమని తెలిపారు. ఇప్పుడు తాము పట్టించుకోకపోతే తెల్లారి మన దగ్గరకు వస్తారని చెప్పారు.

రేపు బీహెచ్ఈఎల్, సింగరేణి అమ్ముదామంటారని పేర్కొన్నారు. తెలంగాణలో ఏం జరిగినా తమకు కూడా మద్దతు తెలిపాలని కోరారు. తమకు మద్దతు ఇచ్చినందుకు కేటీఆర్ కు థ్యాంక్స్ చెబుతున్నట్లు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు తెలిపారు. తమ ఉద్యమానికి తెలంగాణ సపోర్టు చేయడం గర్వ కారణం అన్నారు.