Minister Vemula : ‘కేసీఆర్ ను టచ్ చేసి చూడండి.. మా దమ్మేంటో చూపిస్తాం’ : మంత్రి వేముల

రైతుబంధు ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పారు. నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు.

Minister Vemula : ‘కేసీఆర్ ను టచ్ చేసి చూడండి.. మా దమ్మేంటో చూపిస్తాం’ : మంత్రి వేముల

Vemula

Updated On : January 12, 2022 / 11:26 PM IST

minister Vemula fired Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, అర్వింద్ పై తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను టచ్ చేసి చూడండి.. మా దమ్మేంటో చూపిస్తాం.. అంటూ సవాల్ విసిరారు. రైతుబంధు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్నారా అని ప్రశ్నించారు.

రైతుబంధు ఇస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్పారు. నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. కేసీఆర్ ను జైలులో పెడతామంటూ ఏడాది నుంచి మొరుగుతున్నారని పేర్కొన్నారు. దమ్ముంటే విచారణ చేయండి అని అన్నారు. ఎవరు జైలుకు పోయారో గుర్తు చేసుకోవాలని చెప్పారు.

Visa Free Travel : భారతీయులు వీసా లేకుండా 60 దేశాలకు వెళ్లొచ్చు

అంతకముందు సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత మురళీధరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి అంశంలో సీఎం కేసీఆర్ ను జైలుకు పంపడం ఖాయమన్నారు. బుధవారం (జనవరి12,2022) హైదరాబాద్ లో మురళీధరరావు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అవినీతి చేస్తే ఎంతటి వారైనా జైలుకు వెళ్లాల్సిందేనని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పోటీలోనే లేదని చెప్పారు.