Telangana Rains : తెలంగాణలో తేలికపాటి వర్షాలు.. రాబోయే 3 రోజులు జాగ్రత్త!

తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.

Telangana Rains : తెలంగాణలో తేలికపాటి వర్షాలు.. రాబోయే 3 రోజులు జాగ్రత్త!

Telangana Rains To Be Continued For 3 Days In State

Telangana Rains :  తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నిన్నటి (శుక్రవారం) తీవ్ర అల్పపీడనం, కోస్తాంధ్ర తీరం మీదుగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి (ఇంటీరియర్) శనివారం బలహీనపడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు తూర్పు, ఆగ్నేయ దిక్కుల నుంచి వీస్తున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో రాబోయే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

మరోవైపు హైదరాబాద్‌లో మోస్తరు వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. పలుచోట్ల వర్షం కారణంగా నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. అసెంబ్లీ, బషీర్ బాగ్, బేగంబజార్, కోటి, సుల్తాన్ బజార్ , అబిడ్స్ , నాంపల్లి, హిమాయత్ నగర్ , నారాయణగూడ, లిబర్టీ, దిల్ సుఖ్ నగర్ , ఎల్బీనర్ వనస్థలిపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. రహదారులపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Read Also : Chittoor Rain : తప్పిన పెనుముప్పు, రాయల చెరువుకు గండి