Moinabad Farm House Case : ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు..నందకుమార్‌ భార్య చిత్రలేఖ,న్యాయవాది ప్రతాప్ గౌడ్‌కు సిట్ నోటీసులు

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో మరో ఇద్దరికి సిట్ నోటీసులు జారీ చేసింది. నిందితుడు నందకుమార్‌ భార్య చిత్రలేఖ,న్యాయవాది ప్రతాప్ గౌడ్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది.

Moinabad Farm House Case : ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు..నందకుమార్‌ భార్య చిత్రలేఖ,న్యాయవాది ప్రతాప్ గౌడ్‌కు సిట్ నోటీసులు

Moinabad Farm House Case

Moinabad Farm House Case : మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యే కేసులో సిట్ అధికారులు రోజు రోజుకు దూకుడు పెంచుతున్నారు. దీంట్లో భాగంగా సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. కేసులో విచారణకు రావాలనే పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో కీలకంగా ఉన్న నిందితుడు నందకుమార్‌ భార్య చిత్రలేఖకు సిట్ నోటీసులు ఇచ్చింది. అలాగే అంబర్‌పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్‌కు నోటీసులు పంపింది. ఇవాళ ఇద్దరూ విచారణకు హాజరుకావాలని సిట్‌ ఆదేశించింది.

ఈకేసులో ఇప్పటికే అరెస్ట్ అయి జైల్లో ఉన్న సింహయాజికి విమాన టికెట్ బుక్ చేసిన శ్రీనివాస్ ను సిట్ మూడో రోజు విచారించనున్నారు. ఇప్పటికే వరుసగా రెండు రోజుల పాటు శ్రీనివాస్ ను విచారించారు. మొదటి రోజు 8గంటలు..రెండో రోజు ఐదు గంటలపాటు ప్రశ్నించారు.ఈకేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదని అయినా పదే పదే సిట్ తనపై ప్రచారం జరుగుతోంది అన్నారు అడ్వకేట్ శ్రీనివాస్. నందకుమార్ తో అరగంటకు పైగా ఏం మాట్లాడారు అంటూ సిట్ అధికారులు వేసిన ప్రశ్నకు మాత్రం శ్రీనివాస్ సరైన సమాధానం చెప్పలేదు.

కాగా ఇప్పటికే ఈ కేసులో తుషార్, జగ్గుస్వామిలకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది సిట్. నిందితులు దేశం వదిలిపోకుండా ఎయిర్ పోర్టులు..సరిహద్దుల్లో అలెర్ట్ చేసింది. ఇప్పటివరకు నోటీసులకే పరిమితం కాగా.. ప్రస్తుతం అరెస్ట్‌ల దిశగానూ సిట్‌ అడుగులు వేస్తోంది. ఈ విషయంపై న్యాయనిపుణులతో చర్చిస్తోంది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేరళ వైద్యుడు డా.జగ్గుస్వామి, భారతీయ ధర్మజనసేన చీఫ్‌ తుషార్‌లకు నోటీసులు ఇచ్చినా.. ఇప్పటివరకు సిట్‌ ముందు హాజరుకాలేదు.

కాగా..ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిట్ విచారణకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ఎందుకు హాజరుకాలేదు అని ప్రశ్నించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించిన తరువాత కూడా విచారణకు ఎందుకు హాజరు కాలేదు? అని నిలదీసింది.