Ugadi 2022: తెలుగు వారి సంవత్సరాది ఉగాది.. షడ్రుచుల కలబోత ఈ పర్వదినం!

శ్రీ శుభకృత్ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారు జరుపుకునే పండుగ ఉగాది. అయితే, నూతన సంవత్సరం..

Ugadi 2022: తెలుగు వారి సంవత్సరాది ఉగాది.. షడ్రుచుల కలబోత ఈ పర్వదినం!

Ugadi 2022

Ugadi 2022: శ్రీ శుభకృత్ నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ తెలుగువారు జరుపుకునే పండుగ ఉగాది. అయితే, నూతన సంవత్సరం అనే మాట వినగానే చాలా మందికి మనసులో మెదిలేది జనవరి 1వ తేది. సంవత్సరం ఆరంభం అనగానే ఎందరికో ఆ తేదియే గుర్తుకొస్తుంది. కానీ మన శాస్త్రీయమైన సంవత్శరారంభం ఉగాది. ఉగాదికి సంవత్సరాది అనే పేరైతే ఉంది కానీ, నూతన సంవత్సరం అనేది ప్రజలు మర్చిపోతున్నారు. నేటి సమాజం ఉగాది పండుగ యొక్క విశిష్టతను మరచిపోవడం చాలా దురదృష్టకరం.

Ugadi Pachadi : షడ్రుచుల ఉగాది పచ్చడి తయారీ ఎలాగంటే?

ఎందుకంటే కాలమానంలోని అంశాలన్నింటిని పూర్తిగా ఖగోల శాస్త్రరీత్యా ఏర్పాటు చేసుకున్న ఏకైక జాతి హిందుజాతి. కాలమాన అంశాలైన రోజు, వారం, పక్షం, కార్తె, మాసం, రుతువు, అయనం, సంవత్సరం, పుష్కరం, శకం, యుగం, కల్పకం మొదలైన అన్నింటినీ హిందువులు ఖగోళ శాస్త్ర ఆధారంగానే ఏర్పాటు చేసుకున్నారు. ఖగోలశాస్త్ర బద్దమైన కాలమానాన్ని పురాణకాలం నుండి కలిగివున్న ఘనత కూడా ఈ హిందువులది. అలా ఖగోళ శాస్త్ర ప్రకారం నిర్ణయించి.. మొదటి రుతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి పక్షం శుక్లపక్షం.. ఇవన్నీ ఒకటిగా కలిసి వచ్చే పండుగ ఉగాది.

Ugadi Festival : చైత్రమాసం – ఉగాది పండుగ విశిష్టత

ఈ రోజునే బ్రహ్మసమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారంతో సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఈ రోజే. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైంది కూడా ఉగాదినాడే. మోడువారిన చెట్లు చిగురిస్తూ, పూల పరిమళాలతో గుబాళిస్తూ, పుడమితల్లిని పులకింపచేసే వసంతరుతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే ప్రారంభమవుతుంది. ఒక్క తెలుగు సంప్రదాయంలోనే కాకుండా మరాఠీలు ‘గుడి పడ్వా’, మలయాళీలు ‘విషు’, సిక్కులు ‘వైశాఖీ’, బెంగాలీలు ‘పాయ్‌లా బైశాఖ్’, తమిళులు ‘పుత్తాండు’ అనే పేర్లతో ఉగాదిని జరుపుకోవడం విశేషం.

Ugadi 2021 : ఉగాది పండుగ, వెంకన్నను అల్లుడిగా భావించే ముస్లింలు..ప్రత్యేక పూజలు

ఈ పండుగ రోజున పంచాంగ శ్రవణము చేయుట, షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని భుజించుట ప్రశస్త్యమైనది. తమ జీవితాలు అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని పచ్చడి రుచులతో కలిసి ఆకాంక్షిస్తారు. ఇందులో తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులూ జీవితంలోని బాధ, సంతోషం, ఉత్సాహం, నేర్పు, సహనం, సవాళ్లకు సంకేతాలు. సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చెడులను, కష్టసుఖాలనూ ఒకేలా స్వీకరించాలన్న సందేశాన్ని చెబుతాయి. ఇక, మనకు జాతరలు ఈ పండుగ సమయంలోనే ప్రముఖంగా కనిపిస్తాయి.