Gyanvapi Masjid : ‘గతంలో దేవాలయాలే ఇప్పుడు మసీదులుగా మారాయి’ ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

‘గతంలో దేవాలయాలే ఇప్పుడు మసీదులు మారాయి’ అంటూ యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్.. తాఖీర్ రజా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gyanvapi Masjid : ‘గతంలో దేవాలయాలే ఇప్పుడు మసీదులుగా మారాయి’ ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Gyanvapi Masjid

Gyanvapi Masjid :  జ్ఞానవాపి మసీదులో సర్వే ఎంత వివాదాస్పదం అవుతోంది ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ఈ వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఇప్పటికే సర్వేలో భాగంగా మసీదులోని కొలనులో శివలింగం ఉందని గుర్తించిన విషయం కూడా తెలిసిందే. ఈక్రమంలో యూపీలోని ఇత్తెహాద్ మిల్లత్ కౌన్సిల్ చీఫ్..కాంగ్రెస్ నేత తాఖీర్ రజా తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని పలు మసీదులు ఒకప్పుడు దేవాలయాలేనని వాటిపైనే మసీదులు నిర్మించారు అని అన్నారు. కానీ ఆలయాలను కూల్చి వేసి మసీదులను కట్టలేదని..అప్పట్లో ప్రజలు పెద్ద సంఖ్యలోని ఇస్లాంలోకి మారి ఆలయాలను మసీదులుగా మార్చారని వ్యాఖ్యానించారు. అలా నిర్మించిన మసీదులను వివాదం చేయవద్దని వాటిని ముట్టుకోరాదని తేల్చి చెప్పారు.

Also read : Gyanavapi Mosque: జ్ఞానవాపి మసీదు అరుదైన చిత్రం చెప్పే అత్యంత ఆసక్తికర కథ..

జ్ఞానవాపి మసీదులో శివలింగం దొరికిందని చెప్పడం.. హిందూయిజంపై దాడి చేయడమేనని..దేశంలోని చాలా మసీదులు కట్టడానికి ముందు.. ఆ ప్రదేశంలో దేవాలయాలే ఉండేవని అన్నారు. అయితే..ఆ ఆలయాలను కూల్చలేదని స్పష్టంచేశారు. దేవాలయాలను మసీదులుగా మార్చారు అని అన్నారు. అటువంటి మసీదులను వివాదం చేయవద్దని వాటిని ముట్టుకోవద్దని సూచించారు. అలా కాదని ప్రభుత్వం బలవంతపు చర్యలకు పూనుకుంటే మాత్రం ముస్లింలు వ్యతిరేకించి తీరుతారని స్పష్టం చేశారు.

Also read : GYANVAPI ROW : జ్ఞానవాపి మసీదులోకి శివలింగం ఎలా వచ్చింది ? వీడియోగ్రఫీ సర్వేలో ఏం తేలింది ?

ఈ విషయంలో ముస్లింలు ఎవరూ న్యాయ పోరాటానికి సిద్ధమవ్వాల్సిన అవసరం లేదని అన్నారు రజా. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఎటువంటి తీర్పు వచ్చిందో తెలిసినవిషయమే కదా అని అన్నారు. జ్ఞానవాపి మసీదుపై ఇప్పుడు ఏ కోర్టుల్లోనూ అప్పీలు చేయబోమన్నారు. విద్వేషవాదులు.. దేశంలోని అన్ని మసీదుల్లోనూ కొలనుల్లో శివలింగాలను గుర్తిస్తారన్నారు. వాళ్లు తలచుకుంటే ఏదైనా జరుగుతుంది అన్నారు. దేశంలో శాంతి సామరస్యాలను కాపాడేందుకు ముస్లింలు శాంతంగా ఉంటున్నారన్నారు. కాగా..జ్ఞానవాపి మసీదులో గుర్తించారంటున్న శివలింగం ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.