TFCC elections : తెలుగు సినీ పరిశ్రమలో మరో ఎన్నికలు.. ఈ ఎన్నికలు ఎలా ఉంటాయో?

తాజాగా తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ)కి నవంబర్‌ 14న ఎన్నికలు జరగనున్నాయి అని టీఎఫ్‌సీసీ ప్రస్తుత చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ తెలిపారు. మరో రెండు రోజుల్లో

TFCC elections : తెలుగు సినీ పరిశ్రమలో మరో ఎన్నికలు.. ఈ ఎన్నికలు ఎలా ఉంటాయో?

Tfcc

TFCC elections :  గతంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒకటే ఉండేది. తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కూడా ఏర్పడింది. ఈ ఛాంబర్ లో తెలంగాణ కి సంబంధించిన స్టూడియోలు, అవుట్‌డోర్ యూనిట్లు, ఫిల్మ్ ప్రొడ్యూసర్‌లు, డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్‌లతో కూడి ఉంటుంది. సినిమాకి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు, వాటికి సంబంధించిన సమస్యలు పరిష్కరించడం అన్ని ఈ ఛాంబర్ ద్వారానే జరుగుతాయి.

తాజాగా తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (టీఎఫ్‌సీసీ)కి నవంబర్‌ 14న ఎన్నికలు జరగనున్నాయి అని టీఎఫ్‌సీసీ ప్రస్తుత చైర్మన్‌ ప్రతాని రామకృష్ణ గౌడ్‌ తెలిపారు. మరో రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. ప్రస్తుతం 30 మందితో కూడిన టీఎఫ్‌సీసీ పాలక కమిటీ గడువు త్వరలో ముగియనుంది. కొత్త కమిటీ కోసం ఈ ఎన్నికలు జరగనున్నాయి. 8 వేలమంది సినీ కార్మికులతో, 800 మంది నిర్మాతలతో, నాలుగు వందల మంది తెలంగాణ ఆర్టిస్టులతో టీఎఫ్‌సీసీ అభివృద్ది పథంలో ముందుకు నడుస్తోందని ప్రతాని రామకృష్ణ గౌడ్‌ తెలిపారు. ఇందులో ఉండే కొంతమందికి ఇప్పటికే ఐదు లక్షల రూపాయల హెల్త్‌ కార్డులు అంద జేసినట్టు ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పెద్ద ఎత్తున త్వరలోనే సినిమా అవార్డుల ఫంక్షన్లను నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు.

Squid game : సూపర్ హిట్ నెట్‌ఫ్లిక్స్ స్క్విడ్ గేమ్‌ని విమర్శిస్తున్న పాకిస్థాన్

ఈ షెడ్యూల్ వెలువడిన తర్వాత కానీ ఎవరెవరు పోటీ చేస్తారనేది తెలుస్తుంది. మొన్న జరిగిన ‘మా’ ఎన్నికల్లో ఎంత రసాభాస జరిగిందో చూశాము. ఇప్పుడు మరో ఎలక్షన్స్ అంటే ఇవి కూడా అదే రేంజ్ లో జరుగుతాయా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది కేవలం తెలంగాణ ఫిలిం ఛాంబర్ కాబట్టి అది కూడా ప్రొడ్యూసర్స్ , డిస్ట్రిబ్యూటర్స్ తో కూడుకుంది కాబట్టి ‘మా’ ఎన్నికల లాగా హడావిడి కూడా ఉండకపోవచ్చు అనిపిస్తుంది.