Anita Hassanandani: భర్తతో కలిసి కండోమ్ వాడకం గురించి చెప్పిన హీరోయిన్!
మన దేశంలో పదిమంది ముందు సెక్స్ అనే పదం వాడ్డానికి కూడా చాలా మంది సిగ్గు పడుతుంటారు. కానీ హీరోయిన్స్ మాత్రం ఏ మాత్రం మొహమాటపడకుండా ఈ కండోమ్ వాడితే మంచి అనుభూతి కలుగుతుందని..

Anita Hassanandani
Anita Hassanandani: మన దేశంలో పదిమంది ముందు సెక్స్ అనే పదం వాడ్డానికి కూడా చాలా మంది సిగ్గు పడుతుంటారు. కానీ హీరోయిన్స్ మాత్రం ఏ మాత్రం మొహమాటపడకుండా ఈ కండోమ్ వాడితే మంచి అనుభూతి కలుగుతుందని, లైంగిక సంతృప్తి కలుగుతుందని ప్రమోట్ చేస్తున్నారు. అమ్మో అమ్మో.. ఏంటీ తెగింపు అని ప్రజలు ఎలా అనుకున్నా డోంట్ కేర్ అన్నట్లు ముద్దుగుమ్మలు అంతే ముద్దుగా కండోమ్స్ కంపెనీలను ప్రమోట్ చేసి పెడుతున్నారు. వీలుంటే భర్తలు, బాయ్ ఫ్రెండ్ తో కలిసి ప్రమోట్ చేస్తున్నారు.
Bollywood Couples: ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్.. ప్రేమకు వయసుతో పనేంటి?
ఇప్పటికే కొందరు హీరోయిన్ ఇలా కండోమ్ యాడ్స్, సోషల్ మీడియా ప్రమోషన్లు చేయగా ఇప్పుడు అనితా కూడా మొదలు పెట్టింది. ఉదయ్ కిరణ్ హీరోగా తెరకెక్కిన ‘నువ్వు నేను’ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించిన అనిత ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకున్న ఈ అమ్మడు తెలుగుతో పాటు ఇతర భాషల్లో సినిమాలతో పాటు సీరియల్ లో కూడా నటించి గట్టిగానే వెనకేసుకుందని టాక్.
Bollywood Couples: అలియా నుండి కరీనా వరకు.. మోస్ట్ హ్యాపెనింగ్ లవ్ మ్యారేజెస్!
ఇక పెళ్ళై.. తల్లిగా మారడంతో నటనకు దూరంగా ఉన్న అనితా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఫ్యామిలీతో గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను గట్టిగానే సంపాదించుకుంది. ఇన్ స్టాలో బ్రాండ్స్ వీడియోలను షేర్ చేస్తూ ప్రమోటర్ కూడా ఆదాయం దక్కించుకుంటుంది. అదే క్రమంలో తాజాగా కండోమ్ ప్రమోషన్ మొదలు పెట్టింది. ఓ కంపెనీ కండోమ్ వాడాలని సూచిస్తూ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో అనితా భర్తతో కలిసి కండోమ్ గురించి వివరించడం కొసమెరుపు.
View this post on Instagram