Sirivennela : ‘సిరివెన్నెల’ నటించిన ఒకేఒక్క సినిమా ఏంటో తెలుసా?… అది కూడా ఆర్జీవీ దర్శకత్వంలో

సినిమాలో పాటలు రాస్తున్న సమయంలోనే చాలా మంది దర్శకులు సిరివెన్నెలని నటించమని అడిగారు. కానీ ఎంతమంది తన దగ్గరికి వచ్చి నటించమని అడిగినా కేవలం తెర వెనక పాటలు రాస్తాను. కానీ.......

Sirivennela : ‘సిరివెన్నెల’ నటించిన ఒకేఒక్క సినిమా ఏంటో తెలుసా?… అది కూడా ఆర్జీవీ దర్శకత్వంలో

Gaayam

Sirivennela :  సినిమాల కోసం కలం కదపడమే సిరివెన్నెల పని. ఆ పనిలో పాట రాయడం మాత్రమే కాదు నటించే అవకాశాలు కూడా చాలా వచ్చాయి. ఇండస్ట్రీలో చాలా మంది వివిధ భాగాల్లో ఉన్నా అప్పుడప్పుడు ఆర్టిస్ట్ గా ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోరు. ఆ వెండితెరపై ఒక్కసారన్నా కనపడాలని అందరికి ఉంటుంది. కొంతమందికి ఆ చాన్సు వెతుక్కుంటూ వస్తుంది. సినిమాలో పాటలు రాస్తున్న సమయంలోనే చాలా మంది దర్శకులు సిరివెన్నెలని నటించమని అడిగారు. కానీ ఎంతమంది తన దగ్గరికి వచ్చి నటించమని అడిగినా కేవలం తెర వెనక పాటలు రాస్తాను. కానీ తెర మీద పాత్ర పోషించలేను అన్నారంట. అలాంటి లెజెండరీ లిరిక్ రైటర్ ఒక సినిమాలో ఆ సినిమా దర్శకుడి మీద ఉన్న గౌరవంతో వెండితెరపై కాసేపు కనిపించారు.

S. S. Rajamouli : రాజమౌళి కోరిక తీర్చకుండానే వెళ్ళిపోయిన సిరివెన్నెల

జగపతిబాబు హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాయం’ సినిమా 1993లో విడుదల అయింది. ఈ సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని..’ అంటూ సమాజాన్ని ప్రశ్నిస్తూ ఓ విప్లవ గీతాన్ని రాశారు. ఆ పాట ఇప్పటికి, ఎప్పటికి నిలిచిపోతుంది. ఆయన రాసిన పాటలోనే సిరివెన్నెల నటించారు. అది కూడా కేవలం రామ్ గోపాల్ వర్మ పై ఉన్న అభిమానంతో మాత్రమే చేశారు. ఈ విషయాన్ని కొన్ని ఇంటర్వ్యూలలో తెలిపారు. గతంలో ఆర్జీవీ ప్రతి సినిమాలో సిరివెన్నెల పాట ఉండాల్సిందే.

Sirivennela : సిరివెన్నెల పాటల పూదోటలో వికసించిన అవార్డులు..

‘గాయం’ సినిమా తర్వాత చాలా మంది దర్శకులు తమ సినిమాల్లో కూడా నటించమని సిరివెన్నెలకు ఎన్నో ఆఫర్స్ ఇచ్చారు. కానీ వాటన్నిటిని ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత ‘మ‌న‌సంతా నువ్వే’ సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గానే త‌న పాత్ర‌లోనే గెస్ట్ అప్పిరియ‌న్స్ ఇచ్చారు. ఆయన నటించడం కూడా చేసుంటే చిత్ర పరిశ్రమకి మరో మంచి నటుడు దొరికేవారేమో. ఇకపై తెలుగు సినీ పరిశ్రమ ఆయన పాటల జ్ఞాపకాల్లో బతకాల్సిందే.