The Sakura Pink Diamond: రూ.213 కోట్ల డైమండ్.. వేలంలో దక్కించుకున్న వ్యాపారి!

The Sakura Pink Diamond: రూ.213 కోట్ల డైమండ్.. వేలంలో దక్కించుకున్న వ్యాపారి!

The Sakura Pink Diamond

The Sakura Pink Diamond: డైమండ్ అంటేనే కాస్ట్లీ అంటారు కదా.. అలాంటిది వాటిలో కూడా యమా కాస్ట్లీ అనేవి కూడా ఉంటాయి. ఆలాంటి యమా కాస్ట్లీ డైమండ్ ఒకటి అక్షరాల కోట్లలో ధర పలికింది. ది సాకురా అనే పింక్ డైమండ్ యమా క్రేజీగా రూ.213 కోట్లు ధర పలికింది. ఈ పింక్ డైమండ్‌ను హాంగ్‌కాంగ్‌లో వేలం వేయగా 29.3 మిలియ‌న్ డాల‌ర్లు పలికింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.213 కోట్లు. 15.81 క్యారెట్ల ఈ డైమండ్‌ను ఆసియాలోని ఓ బడా వ్యాపారి సొంతం చేసుకున్నారు.

కాగా, ఇదే ‘ది సాకురా’ అనే 14.8 క్యారెట్ల పర్పుల్-పింక్ డైమండ్ జెనీవాలో గత నవంబర్‌లో ‘ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్’ వేలంలో 27 మిలియన్‌ డాలర్లకు అమ్ముడుపోయింది. అలాగే దోషనివారణ ఓవల్ రత్నం ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్ 23 మిల్లియన్ డాలర్లు పలికిన‌ట్లు స‌మాచారం. ఇప్పుడు తాజాగా మరోసారి ది సాకురా 15.81 క్యారెట్ల డైమండ్‌ రికార్డు ధర పలికింది. కాగా.. దీనిపై క్రిస్టీ వేలం సంస్థ స్పందిస్తూ.. ఆభరణాల వేలం చరిత్రలో ది సాకురా మ‌రో ముఖ్యమైన అధ్యాయాన్ని నమోదు చేసిందని సంతోషం వ్య‌క్తంచేసింది.

అయితే.. అసలు ఈ ది సాకురాకు ఎందుకింత డిమాండ్.. ఇంత ధర ఎందుకు పలికిందంటే.. సాధార‌ణంగా ప‌ర్పుల్ పింక్ డైమండ్లు ప‌ది క్యారెట్ల‌లోపే ఉంటాయి. కానీ ఇది 15.8 క్యారెట్లు ఉంది. జపాన్ ప‌దం అయిన ది సాకురాకు అర్థం చెర్రి గుబాళింపు అని. ఓ ప్లాటినం గోల్డ్ రింగ్‌పై ఈ వ‌జ్రాన్ని పొదిగించి వేలం నిర్వహించారు. గ‌త ఏడాది ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్ ప‌ర్పుల్ పింక్ డైమాండ్‌ 197.95 కోట్లు పలకగా ఈ ఏడాది జస్ట్ ఒక్క క్యారెట్ ఎక్కువగా ఉన్న అలాంటి పింక్ డైమండ్ ఏకంగా సరికొత్త రికార్డును నెలకొల్పింది.