Rare Himalayan vulture : మహారాష్ట్రలో కనిపించిన అరుదైన హిమాల‌య రాబందు

Rare Himalayan vulture : మహారాష్ట్రలో కనిపించిన అరుదైన హిమాల‌య రాబందు

Rare Himalayan Vulture

Updated On : May 27, 2021 / 12:15 PM IST

world’s rarest Himalayan vulture : ఇప్పుటికే ఎన్నో రకాల పక్షులు అంతరించిపోయాయి. ఇటువంటి సమయంలో అరుదైన పక్షులు కనిపిస్తే కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అంతరించిపోయాయనో లేక కనిపించకుండాపోయాయనుకునే అరుదైన పక్షులు కనిపిస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. అటువంటి ఓ అరుదైన పక్షి మహారాష్ట్రలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లో కనిపించి కనువిందు చేసింది. అదే ప్రపంచంలోనే అత్యంత‌ అరుదైన, ప్రత్యేకమైన పక్షి హిమాలయ గ్రిఫ‌న్ రాబందు.

ఈ హిమాలయ రాబందు మహారాష్ట్రలోని సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లో కనిపించింది. చాలా పెద్ద‌గా ఉండే ఈ హిమాలయ రాబందు సాధారణంగా హిమాలయ ప్రాంతంలోను మాత్రమే కనిపిస్తుంటుంది. కానీ టైగర్ ఫారెస్ట్ లో కనిపించటం మాత్రం చాలా ప్రత్యేకమైన విషయమని చెప్పాలి. ఫారెస్ట్ కన్జర్వేటర్, పక్షుల అధ్య‌య‌న‌ నిపుణుడు రోహన్ భటే కంట పడిందీ హిమాలయ రాబందు. సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లో పర్వత శ్రేణుల మధ్యలో ఎగురుతున్న హిమాలయ రాబందును చూసి ఆనందపడిపోయారు. అంతే తన కెమెరాతో ఈ అరుదైన పక్షిని బంధించారు.

హిమాలయ రాబందు ప్రత్యేకతలు..
ఈ గ్రిఫ‌న్ రాబందు 1200 నుంచి 5000 మీటర్ల ఎత్తులో ఎగురుతుంటుంది. వేల కిలోమీటర్ల దూరం చాలా ఈజీగా ప్రయాణిస్తుంది. ఈ హిమాలయ రాబందు ఆకాశంలో అత్యంత ఎత్తున‌ ఎగురుతూ ఆహారం కోసం వెతుకుతుంటుంది. టిబెట్, కాబూల్, భూటాన్, తుర్కిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకస్తాన్, తజికిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల‌తో పాటు పశ్చిమ చైనా, మంగోలియా, హిమాలయ ప్రాంతాల‌లో క‌నిపిస్తుంది. దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో కనిపించే ఈ పక్షి125 సెంటీమీట‌ర్ల‌ ఎత్తు, 8 నుంచి 9 అడుగుల పొడ‌వైన రెక్కలను కలిగి ఉంటుంది. గ్రిఫిన్ రాబందు మగ, ఆడ జాతులు ఒకేకంగా కనిపిస్తాయి. 8 నుంచి 10 కిలోల బరువు క‌లిగి ఉంటాయట ఈ హిమాలయ రాబందులు.