Commonwealth Games: బర్మింగ్‌హోమ్‌లో 11వ రోజు భారత్ క్రీడాకారులు ఆడే గేమ్స్ ఇవే.. పీవీ సింధూ వైపు అందరిచూపు?

బర్మింగ్ హోమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ లో 11వ రోజు భారత క్రీడాకారులు ఆడనున్నారు. వీరిలో పి.వి. సింధూ కూడా ఉంది. పీవీ సింధూ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సింధూకు గోల్డ్ మెడల్ వచ్చినట్లే.

Commonwealth Games: బర్మింగ్‌హోమ్‌లో 11వ రోజు భారత్ క్రీడాకారులు ఆడే గేమ్స్ ఇవే.. పీవీ సింధూ వైపు అందరిచూపు?

Commonwealth Games: బర్మింగ్‌హామ్‌ (Birmingham) లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022 (Commonwealth Games 2022) 10వ రోజు భారత్‌కు నాలుగు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్యాలతో 13 పతకాలు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 55 పతకాలతో భారతదేశం పతకాల పట్టికలో ఐదవ స్థానంలో ఉంది. 11వ రోజు క్రీడల్లో పాల్గొనేందుకు భారత్ అథ్లెట్లు సిద్ధమయ్యారు.

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో సరికొత్త రికార్డు.. స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న 75ఏళ్ల వృద్ధుడు

11వ రోజు క్రీడల్లో కీలక ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా స్టార్ బ్యాడ్మింటన్ పి.వి. సింధూ గోల్డ్ మెడల్ మ్యాచ్ లో తలపడుతోంది. కెనడాకు చెందిన మిచెల్ లీతో పి.వి. సింధూ తలపడనుంది. పీవీ సింధూ గెలుస్తుందని, భారత్ కు మరో పతకం ఖాయమన్న భావనలో క్రీడాభిమానులు ఉన్నారు. మరోవైపు లక్ష్యసేన్ (పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్ (పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ గోల్డ్), అచంట శరత్ (పురుషుల సింగిల్స్ టేబుల్ టెన్నిస్) లో ఫైనల్ మ్యాచ్ లు ఆడనున్నారు. వీరిలో అందరూ విజయం సాధిస్తే ఈ రోజు భారత్ కు స్వర్ణ పతకాల పంట పండనుంది.

Commonwealth Games 2022 : పసిడి పట్టు.. కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత రెజ్లర్ల జోరు.. ఒకేరోజు 3 స్వర్ణాలు

11వ రోజు భారత క్రీడాకారుల షెడ్యూల్ ఇదే ..

మధ్యాహ్నం 1.20 గంటలకు : మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌ గోల్డ్ మెడల్ మ్యాచ్. (పీవీ సింధు వర్సెస్‌ మిచెల్‌ లీ – కెనడా)
మధ్యాహ్నం 2:10 గంటలకు : పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ గోల్డ్ మెడల్ మ్యాచ్. (లక్ష్య సేన్ వర్సెస్‌ జే యోంగ్‌ ఎన్‌జీ -మలేషియా)
మధ్యాహ్నం 3గంటలకు : పురుషుల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ గోల్డ్ మెడల్ మ్యాచ్. (సాత్విక్ సాయి రాజ్-చిరాగ్ శెట్టి వర్సెస్‌ బెన్‌ లేన్‌-సీన్‌ వెండీ -ఇంగ్లండ్‌)
మధ్యాహ్నం 3:35గంటలకు : పురుషుల సింగిల్స్‌ టేబుల్ టెన్నిస్‌ బ్రాంజ్ మెడల్ మ్యాచ్. (సాథియాన్‌ జ్ఞానశేఖరన్‌ వర్సెస్‌ పాల్‌ డ్రింక్‌హాల్‌ – ఇంగ్లండ్‌)
మధ్యాహ్నం 4.25 గంటలకు : పురుషుల సింగిల్స్‌ టేబుల్ టెన్నిస్‌ గోల్డ్ మెడల్ మ్యాచ్. (ఆచంట శరత్ కమల్ వర్సెస్‌ లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌ – ఇంగ్లండ్‌)
సాయంత్రం 5 గంటలకు : పురుషుల హాకీ గోల్డ్ మెడల్ మ్యాచ్.( ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది).