OTT Releases: తగ్గేదేలే.. ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలివే!

ఎప్పటిలాగానే ఈ వారం కూడా తగ్గేదే లే అంటున్నాయి ఓటీటీలు. ఎప్పటినుంచో ఊరిస్తోన్న మిన్నాల్ మురళీ ఈ వారమే నెట్ ఫ్లిక్స్ కి రాబోతున్నాడు. ఇక డిజిటల్ ప్లాట్ ఫాంపై ధనుష్, అక్షయ్ కుమార్..

OTT Releases: తగ్గేదేలే.. ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలివే!

Ott Releases

OTT Releases: ఎప్పటిలాగానే ఈ వారం కూడా తగ్గేదే లే అంటున్నాయి ఓటీటీలు. ఎప్పటినుంచో ఊరిస్తోన్న మిన్నాల్ మురళీ ఈ వారమే నెట్ ఫ్లిక్స్ కి రాబోతున్నాడు. ఇక డిజిటల్ ప్లాట్ ఫాంపై ధనుష్, అక్షయ్ కుమార్ కలిసి నెవర్ బిఫోర్ రేంజ్ లో మెస్మరైజ్ చేస్తామంటున్నారు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, కోలీవుడ్ స్టార్ ధనుశ్ కలిసి అత్రాంగి రే సినిమాతో హాట్ స్టార్ ఎంట్రీ ఇస్తున్నారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సారా అలీఖాన్ హీరోయిన్. ఇప్పటికే ప్రామిసింగ్ ట్రైలర్ తో అట్రాక్ట్ చేసాడు డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్. సినిమా కూడా అదిరిపోతుందని ఫుల్ ప్రమోషన్స్ చేస్తున్నారు మూవీ యూనిట్.

New Film Releases: లక్కీ ఛాన్స్.. ఈ వారం నానీ, రణ్వీర్‌లదే..!

ఫస్ట్ టైమ్ మలయాళీ ఇండస్ట్రీ నుంచి పాన్ వరల్డ్ మూవగా రాబోతున్న సూపర్ హీరో ఫిల్మ్ మిన్నాల్ మురళీ. టోవినో థామస్ లీడ్ రోల్ చేసాడిందులో. అడ్వాంచరస్ కామెడీగా ఇంగ్లీష్ తో సహా ఇండియన్ మెయిన్ లాంగ్వెజెస్ అన్నింటిలో ఈ నెల 24న స్ట్రీమింగ్ చేయబోతుంది నెట్ ఫ్లిక్స్. అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ లీడ్ రోల్స్ చేసిన డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ ఈ వీక్ సోనీలివ్ లో స్ట్రీమింగ్ కి రెడీఅయింది. తెలుగు, తమిళ్ భాషల్లో అందుబాటులో ఉండబోతున్న ఈ మూవీని కెవి గుహన్ డైరెక్ట్ చేసాడు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ మూవీపై సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు ఆశలు పెట్టుకుంది.

RRR: ప్రమోషన్స్.. భీమ్-రామ్ మేకింగ్ వీడియోలు వైరల్!

హాట్ స్టార్ లో తెలుగు వెబ్ సిరీస్ పరంపర ఈ 24న రిలీజ్ కాబోతుంది. తమిళ్ యాక్టర్ శరత్ కుమార్ తో పాటూ జగపతి బాబు, నవీన్ చంద్ర మెయిన్ క్యారెక్టర్స్ చేసారిందులో. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామాగా పరంపర సిద్ధమైంది. ఆకాంక్ష సింగ్ లేడీ లీడ్ గా కనిపించబోతుంది. థియేటర్స్ లో రిలీజైన జాన్ అబ్రహం సత్యమేవజయతే2 డిసెంబర్ 23న అమెజాన్ ప్రైమ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. నెట్ ఫ్లిక్స్ లో డోంట్ లుక్ అప్, హాట్ స్టార్ లో యానిమేషన్ అడ్వంచర్ ఎంకాంటో, ఫార్ ఫ్రమ్ ది ట్రీ… కొరియన్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ది సైలెంట్ సీ నెట్ ఫ్లిక్స్ లో.. ఈరోజ్ నౌలో బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ స్విచ్చ్ వంటి ప్రాజెక్ట్స్ ఈ వీక్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.