New Film Releases: లక్కీ ఛాన్స్.. ఈ వారం నానీ, రణ్వీర్‌లదే..!

పుష్ప, అఖండ ఇచ్చిన బూస్టప్ తో ఈ వీక్ కూడా థియేటర్స్ కి రాబోతున్నాయి కొన్ని సినిమాలు. ముఖ్యంగా ఈ క్రిస్ మస్ మనదే అంటూ బరిలోకి దూకుతున్నాడు నాని. అటు బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా..

New Film Releases: లక్కీ ఛాన్స్.. ఈ వారం నానీ, రణ్వీర్‌లదే..!

New Film Releases

New Film Releases: పుష్ప, అఖండ ఇచ్చిన బూస్టప్ తో ఈ వీక్ కూడా థియేటర్స్ కి రాబోతున్నాయి కొన్ని సినిమాలు. ముఖ్యంగా ఈ క్రిస్ మస్ మనదే అంటూ బరిలోకి దూకుతున్నాడు నాని. అటు బాలీవుడ్ నుంచి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా 83 రిలీజ్ కాబోతుంది. రెండూ ఆడియెన్స్ ఎదురుచూస్తోన్న సినిమాలే.

RRR: ప్రమోషన్స్.. భీమ్-రామ్ మేకింగ్ వీడియోలు వైరల్!

సినిమా గురించి ఎంత చెప్పిన డబ్బా కొట్టుకున్నట్టు ఉంటుందన్న నాని.. క్రిస్ మస్ మాత్రం మనదే అంటూ శ్యామ్ సింగరాయ్ పై అంచనాలు పెంచేస్తున్నాడు. నాని డ్యూయల్ రోల్ చేస్తోన్న ఈ సినిమా ఆడియెన్స్ ను 50ఏళ్లు వెనక్కి తీసుకెళ్లబోతుంది. సౌత్ లాంగ్వెజెస్ అన్నింటిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో అట్రాక్టివ్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. కల్ట్ క్లాసిక్ గా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఈ మూవీని తెరకెక్కించినట్టు చెప్తున్నారు.

Malavika Mohanan: కట్టు జారిపోతా ఉంది హొయ్.. చీరకట్టు జారిపోతా ఉంది!

ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సాయిపల్లవి, లేటెస్ట్ వాసు క్యారెక్టర్ సరసన కృతిశెట్టి అలరిస్తారని అంటున్నారు. మడోన్నా సెబాస్టియన్ మరో కీ రోల్ చేసింది. ఈ నెల 24న రిలీజ్ కాబోతున్న శ్యామ్ సింగ రాయ్ పై నాని ఎంతలా అంచనాలు పెట్టుకున్నాడో.. సాయిపల్లవి అంతే రేంజ్ లో సక్సెస్ ఆశిస్తోంది. కంటెంట్ బాగుంటే క్రిస్ మస్ హాలిడే సీజన్ శ్యామ్ సింగ రాయ్ కి కలిసొచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Bajrangi Bhaijaan 2: టాలీవుడ్ మీద కన్నేసిన సల్మాన్.. తెలుగు రైటర్‌తో మరో సినిమా!

బాలీవుడ్ మూవీనే అయినా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది 83. అన్ని భాషల్లో ఈ సినిమా ఈ శుక్రవారమే థియేటర్స్ కి రాబోతుంది. అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా 1983లో ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది. ఏ మాత్రం అంచనాల్లేని జట్టును విజయం దిశగా నడిపించారు కపిల్ దేవ్. ఈ ఫీట్ సాధించడం అంత తేలికగా జరగలేదు. ఎన్నో ట్విస్ట్‌లతో కూడి.. అసాధారణ ప్రయాణాన్ని సాగించారు. ఈ మొత్తాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్న ప్రయోగమే.. `83`.

Pushpa: వీకెండ్ పోయినా తగ్గేదేలే.. నాలుగో రోజు పుష్పరాజ్ భారీ వసూళ్లు

క‌పిల్ దేవ్‌గా ర‌ణ్ వీర్ సింగ్‌, క‌పిల్ వైఫ్ రూమీ భాటియాగా దీపికా ప‌దుకొనె, సునీల్ గ‌వాస్క‌ర్‌గా తాహిర్ రాజ్ బాసిన్‌, కృష్ణ‌మాచార్య శ్రీకాంత్‌గా జీవా, మ‌ద‌న్ లాల్‌గా హార్డీ సందు, మ‌హీంద్ర‌నాథ్ అమ‌ర్‌నాథ్‌గా స‌కీబ్ స‌లీమ్‌, ర‌విశాస్త్రిగా కార్వా.. ఇలా చాలా రియల్ లైఫ్ క్యారెక్టర్స్ మనకు 83లో కనిపించబోతున్నాయి. వరల్డ్ వైడ్ చాలా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ మూవీపై బాగానే ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంది బాలీవుడ్ ఇండస్ట్రీ. పుష్ప నంబర్ గేమ్ ను 83 బీట్ చేసే ఛాన్స్ ఉందని వాళ్లు నమ్ముతున్నారు.