Salaar: ‘సలార్’ ఇంకా ఎన్ని రోజులు పెండింగ్ ఉందంటే..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో సెట్ అయ్యాయి.

Salaar: ‘సలార్’ ఇంకా ఎన్ని రోజులు పెండింగ్ ఉందంటే..?

These Many Days Left For Salaar Shooting To Complete

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ప్రభాస్‌తో పాటు ప్రశాంత్ నీల్ కూడా ప్లాన్ చేస్తున్నారు.

Salaar: సలార్ షూటింగ్‌పై లేటెస్ట్ అప్డేట్.. అభిమానులకు త్వరలోనే గుడ్ న్యూస్..?

కాగా, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి చిత్ర వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి అంశానికి చేరుకుందని.. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యేందుకు మరో 30-35 రోజుల సమయం పడుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ షెడ్యూల్‌లో సినిమాలోని పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Salaar: ‘సలార్’పై ఆ నెలలో నిర్ణయం తీసుకుంటారా..?

ఇప్పటికే సినిమాలోని పలు కీలక అంశాలను చిత్ర యూనిట్ తెరకెక్కించగా, ఇప్పుడు ఈ షెడ్యూల్‌లో సినిమాలోని పలు ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్‌లను చిత్రీకరించేందుకు ప్రశాంత్ నీల్ సిద్ధమవుతున్నాడు. ఈ చివరి షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు సినిమాలోని పలువురు ప్రధాన తారలు కూడా పాల్గొంటారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, హొంబాలే ఫిలింస్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. కేజీయఫ్ తరహా పాన్ ఇండియా మూవీగా సలార్ కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.