Adipurush: ‘ఆదిపురుష్’లో ఆ సీక్వెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందట..!

‘ఆదిపురుష్’ మూవీలో పలు సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే విధంగా ఉండబోతున్నాయి. ఇందులో వాలి-సుగ్రీవుల యుద్ధం సీక్వెన్స్‌పై చిత్ర యూనిట్ పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉంది.

Adipurush: ‘ఆదిపురుష్’లో ఆ సీక్వెన్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుందట..!

This Action Sequence To Be Highlight In Adipurush

Updated On : April 18, 2023 / 1:40 PM IST

Adipurush: స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న ది మోస్ట్ వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ పనులు ఎప్పుడో పూర్తయినా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ రీవర్క్స్ కారణంగా ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోంది. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీ రామాయణం ఆధారంగా వస్తుండటంతో యావత్ భారత సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

Adipurush: ఎట్టకేలకు ఓవర్సీస్ డీల్ ముగించుకున్న ఆదిపురుష్..!

ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కాగా, ఈ సినిమాలో చాలా అంశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. అందులో వాలి-సుగ్రీవుల మధ్య జరిగే యాక్షన్ సీక్వెన్స్ అయితే నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమాగా వ్యక్తం చేస్తోంది. ఈ సీక్వెన్స్‌లో వచ్చే యాక్షన్, వీఎఫ్ఎక్స్‌లు ప్రేక్షకులకు అల్టిమేట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వనున్నాయట.

Adipurush : ఆదిపురుష్ నుంచి హనుమంతుడి స్పెషల్ పోస్టర్.. రిలీజ్ డేట్ మార్చేదే లేదు..

ఈ సీక్వెన్స్ కోసం చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌ను కేటాయించిందని.. ఈ సీక్వెన్స్ చూస్తున్నంత సేపు ప్రేక్షకులు సినిమాలో లీనమైపోతారని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, కృతి సనన్ సీతగా కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ పాత్రలో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. మరి రామాయణంలో కీలకమైన వాలి-సుగ్రీవుల యుద్ధాన్ని ‘ఆదిపురుష్’లో ఎలా చూపెట్టారో తెలియాలంటే ఈ ఎపిక్ మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.