Cute Video: పక్షితో తిమింగలం పిల్ల ఆటలు…

ఓ పక్షితో తిమింగలం ఆటలు నెటిజన్లను కట్టిపడేస్తోంది.సీగల్ పక్షి వెంటే తిరుగుతూ దాన్ని భలే ఆటపట్టిస్తున్న వీడియో భలే క్యూట్ గా ఉందంటున్నారు నెటిజన్లు.

Cute Video: పక్షితో తిమింగలం పిల్ల ఆటలు…

Beluga Whale Playing With Seagull Bird

Beluga Whale Playing With Seagull bird : సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో ఫన్నీ ఫన్నీ వీడియోలు, క్యూట్ క్యూట్ వీడియో, ప్రతిభను వెలికి తీసే వీడియోలు, హార్ట్ టచ్చింగ్ చూస్తున్నాం. అటువంటి ఓ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ పక్షితో ఓ తిమింగలం ఆటలు నెటిజన్లను కట్టిపడేస్తోంది.

ఓ సీగల్ పక్షి ఓ చేపను పట్టుకుంది. అప్పుడే దాని దగ్గరకు ఓ తెల్ల తిమింగలం పిల్ల వచ్చింది. పక్ష చేప పట్టుకుని తిందామనుకుంటున్న సమయంలో తిమింగలం పిల్ల దాని ముట్టితో సీగన్ ని ఓ నెట్టు నెట్టింది. దాంతో పక్షి నోట్లో ఉన్న చేప నీళ్లలో పడిపోయింది. ఆ చేప అప్పటికే చచ్చిపోయిందనుకోండి. ఈక్రమంలో తిమింగిలం పిల్ల ఆ పక్షని తెగ ఆటపట్టించింది. అది ఎక్కడికి వెళితే అక్కడికి వెనకాలే వచ్చి దాన్ని ముట్టితో నెడుతోంది. కానీ సీగల్ పక్షి తిమింగలాన్ని అస్సలు పట్టించుకోలేదు.

దీంతో అక్కడే ఉన్న మరో సీగల్ పక్షి దగ్గరకు వెళ్లింది తిమింగలం పిల్ల. అది వెళ్లేసరికి ఆ సీగల్ ఎగిరిపోయింది. దీంతో అది మళ్లీ అదే సీగల్ వద్దకు వచ్చింది. నీళ్లపై సీగల్ తిరుగుతుంటే నీళ్లకింద తిమింగిలం సీగల్ కిందే తిరుగుతూ దాంతో ఆడుకునే క్యూట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆగస్టు 12న ఈ వీడియో బ్యూటెంజిబిడెన్(‘Buitengebieden) అనే ట్విట్లర్ యూజర్ పోస్ట్ చేయగా.. రెండు రోజులకే ఈ వీడియోను 207K మంది చూశారు. ఈ వీడియోకు లైకుల వర్షంతో కురుస్తోంది. మరి మీరు కూడా ఓ లుక్ వేయండీ సీగల్ పక్షిని ఆటపట్టించే తిమింగలం పిల్ల క్యూట్ వీడియోపై..