Bigg Boss 5: డేంజర్ జోన్ లో ముగ్గురు.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

బిగ్ బాస్ ఐదవ సీజన్ ఆరవ వారం చివరికి చేరుకుంది. వారాంతం అంటే హోస్ట్ నాగ్ రావడం ఒకరోజు హౌస్ మొత్తం సందడిగా మారడం.. చూస్తుండగానే ఇంట్లో నుండి ఒకరిని బయటకి పంపడం చకచకా జరిగిపోతాయి..

Bigg Boss 5: డేంజర్ జోన్ లో ముగ్గురు.. ఎలిమినేట్ అయ్యేది ఎవరు?

Big Boss 5: బిగ్ బాస్ ఐదవ సీజన్ ఆరవ వారం చివరికి చేరుకుంది. వారాంతం అంటే హోస్ట్ నాగ్ రావడం ఒకరోజు హౌస్ మొత్తం సందడిగా మారడం.. చూస్తుండగానే ఇంట్లో నుండి ఒకరిని బయటకి పంపడం చకచకా జరిగిపోతాయి. అలానే ఈ వారం కూడా ఎలిమినేషన్ కి సమయం ఆసన్నమైంది. ఈ వారం నామినేషన్స్ లో ఏకంగా 10మంది ఉండడంతో పాటు గత వారానికి ఇప్పటికీ షోలో అనూహ్యంగా ఎన్నో మార్పులు వచ్చాయి. కంటెస్టెంట్ల ఆట తీరు నుండి వాళ్ళకొచ్చే ఓటింగ్ వరకు ఎన్నో మార్పులు జరిగినట్లు తెలుస్తుంది.

Big Boss 5: అడిగి మరీ ప్రపోజ్ చేయించుకున్న పింకీ.. అలకబూనిన సిరి

షణ్ముఖ్‌, ప్రియాంక సింగ్‌, లోబో, శ్రీరామ్‌, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీలు ఈ వారం నామినేషన్ లో ఉండగా ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఉన్న అనధికారిక సమాచారం ప్రకారం
షణ్ముక్ జస్వంత్, సన్నీ తొలి రెండు స్థానాల్లో ఉండగా.. మిగతా వాళ్లందరూ ఓట్లని షేర్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మిగతా ఎనిమిది మందిలో కూడా శ్రీరామ్, ప్రియాంక, జెస్సీ, సిరి, రవి, వీళ్లు ఐదుగురూ కూడా సేఫ్ జోన్ లోనే ఉండగా.. శ్వేత, లోబో, విశ్వలు డేంజర్ జోన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది.

Big Boss 5: అర్ధరాత్రి మానస్ దుప్పట్లో పింకీ.. బీబీ హౌస్‌లో మూడుముక్కలాట!

గతవారం లోబో, విశ్వ, హమీదలు డేంజర్ జోన్ లో ఉండగా హమీదా ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు లోబో, విశ్వలతో పాటు శ్వేత నామినేషన్స్ లో ఉండగా ఇందులో కూడా లోబో ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. నిజానికి లోబోను బిగ్ బాస్ టీమ్ గత మూడు వారాలుగా కాపాడుతూ వస్తుందని సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తుంది. అదే సమయంలో ఇంట్లో లోబో బిహేవియర్ మీద కూడా నెగిటివ్ పెరగడానికి తోడు ఈసారి అవేమీ పనిచేయవని ఇంటి నుండి బయటకి రావడం పక్కా అని ధీమా మాటలు వినిపిస్తున్నాయి.

Big Boss 5: ఫాఫం.. ఉన్న ఒక్క జంటను విడగొట్టేశారే!

ఇక ఇదే సమయంలో డేంజర్ జోన్ లో ఉన్నా విశ్వ ప్రస్తుతం కెప్టెన్ అయ్యాడు కాబట్టి తనకి ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉండదని ఓటింగ్ పెరుగుతుందని ఆశిస్తున్నారు. కానీ.. ఇప్పుడు కెప్టెన్ కారణంగా పెరిగిన మైలేజీ ఏదైనా ఉంటే వచ్చే వారం పనికి వస్తుంది కానీ ఈ వారంలో ఉపయోగపడదు. ప్రస్తుతం విశ్వ కెప్టెన్ అయ్యాడు కాబట్టి ఎలిమినేట్ అవ్వడు అని చాలామంది అనుకుంటున్నారు. కానీ, కెప్టెన్ అయినా కూడా తదుపరి వారం ఇమ్యూనిటీ వస్తుంది కానీ, ఇప్పుడు మాత్రం లీస్ట్ లో ఉంటే ఎలిమినేట్ అవ్వక తప్పదు.

Big Boss 5: శ్రీరామచంద్ర.. హమీదా అర్ధరాత్రి ముద్దులు.. షో శృతి మించుతోందా?

అలాగే, శ్వేతా కూడా చిన్న దానికి పెద్ద దానికి గొడవలు సాగదీయయడంతో పాటుగా సెంటిమెంట్ అస్త్రాలును ప్రయోగించి ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పిస్తుంది. మొత్తంగా ఈ ముగ్గురు డేంజర్ లో ఉన్నా.. అందరిలో లోబో ఈ వారం ఎలిమినేషన్ కి ఎక్కువ అవకాశం ఇచ్చాడని తెలుస్తుంది.