Chay Sam Breakup : చై-సామ్ విడాకుల గురించి ముందే చెప్పిన జ్యోతిష్కుడు.. అఖిల్ గురించి కూడా??

అయితే ఇలాంటి సమయంలో ఒక పాత వీడియో వైరల్‌గా మారింది. సమంత, నాగచైతన్య పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలబడదని వేణుస్వామి అనే జ్యోతిష్యుడు ఐదేళ్ల క్రితమే ఓ వీడియోలో చెప్పారు

Chay Sam Breakup : చై-సామ్ విడాకుల గురించి ముందే చెప్పిన జ్యోతిష్కుడు.. అఖిల్ గురించి కూడా??

Sam

Chay Sam Breakup : ఇప్పుడు టాలీవుడ్‌ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో చై-సామ్ విడాకులు హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటి వరకు అక్కినేని దంపతులపై విడిపోతున్నారని ఎన్నో పుకార్లు వచ్చాయి. కానీ ఈ వార్తలపై సమంత గానీ, నాగ చైతన్య గానీ స్పందించలేదు. త్వరలో వారిద్దరి వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంది. కానీ సడెన్ గా నిన్న సాయంత్రం చై-సామ్ తాము విడిపోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. నిన్నటి నుంచి ఈ వార్త సంచలనంగా మారింది. అభిమానులు, సెలబ్రిటీలు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ఈ వార్తపై స్పందిస్తున్నారు.

అయితే ఇలాంటి సమయంలో ఒక పాత వీడియో వైరల్‌గా మారింది. సమంత, నాగచైతన్య పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలబడదని వేణుస్వామి అనే జ్యోతిష్యుడు ఐదేళ్ల క్రితమే ఓ వీడియోలో చెప్పారు. 2016 చివర్లో ఇండస్ట్రీ మొత్తం నాగచైతన్య, సమంత గురించే చర్చ జరిగింది. వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త హాట్ టాపిక్‌‌గా మారింది. అప్పుడే వీరిద్దరి బంధంపై జ్యోతిష్కుడు వేణుస్వామి స్పందించారు. సమంత, నాగ చైతన్య జాతకాల్లో దోషాలు ఉన్నాయని, ఎక్కువ కాలం కలిసి ఉండలేరని చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Ashish Vidhyarthi : రోడ్డు పైన కాఫీ అమ్ముతున్న ఆశిష్ విద్యార్థి

ఆ వీడియోలో నాగ చైతన్య జాతకంలో శని, రవి కాంబినేషన్ ఉంది. కాల సర్పదోషముంది. సమంతది భరణి నక్షత్రం. అమావాస్య రోజు పుట్టింది. అమ్మాయి జాతకంలోనూ కుజ దోషం, కాల సర్ప దోషం ఉంది. శుక్రుడు నీచ స్థానంలో ఉన్నారు. అంటే భర్తకు దూరంగా ఉండాల్సిన పరిస్థిత వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ వర్కవుట్ కాదు. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. కుటుంబ సమస్యలు తలెత్తే అవకాశం చాలా వరకు ఉంది.వీరిద్దరూ కలిసి ఎక్కువ కాలం ఉండలేరు” అని వేణుస్వామి అన్నారు.

అంతే కాక ఈయనే మరో వీడియోలో అఖిల్ నిశ్చితార్థం జరిగినప్పుడు కూడా అఖిల్ వాళ్ళ బంధం కూడా నిలబడదు అని చెప్పారు. ఆ తరువాత అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకొని విడిపోయారు. ఇప్పుడు ఈ రెండు వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ జ్యోతిష్కుడికి ఫ్రీగా పబ్లిసిటీ కూడా వస్తోంది.