IND vs SL 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడు ఇండియా వర్సెస్ శ్రీలంక మూడోవన్డే.. సూర్యకుమార్, ఇషాన్‌కు చోటుదక్కేనా?

ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే ఇవాళ జరుగుతుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. గతంలో ఇక్కడ కేవలం ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే జరిగింది. వెస్టెండీస్ జట్టుపై భారత్ విజయం సాధించింది. నేడు జరిగే మ్యాచ్‌లో యువ ఆటగాళ్లకు తుదిజట్టులో అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

IND vs SL 3rd ODI: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడు ఇండియా వర్సెస్ శ్రీలంక మూడోవన్డే.. సూర్యకుమార్, ఇషాన్‌కు చోటుదక్కేనా?

Team India

IND vs SL 3rd ODI: భారత్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు మూడో వన్డే తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరుగుతుంది. వరుసగా రెండు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా.. మూడో వన్డేలోనూ శ్రీలంకను ఓడించి సిరీస్‌ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. గత రెండు మ్యాచ్ లలో పెద్దగా మార్పులు లేకుండా భారత్ జట్టు బరిలోకి దిగింది. మూడో వన్డేలో యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో.. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు నేడు జరిగే మూడో వన్డేలో అవకాశం దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

India vs sri lanka 2nd ODI: రెండో వ‌న్డేలోనూ భార‌త్‌దే విజ‌యం.. సిరీస్ కైవ‌సం.. ఫొటో గ్యాల‌రీ

ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. గతంలో ఈ మ్యాచ్‌లో ఒకే వన్డే జరిగింది. 2019లో జరిగిన వన్డేలో వెస్టిండీస్, భారత్ జట్లు తలపడ్డాయి. భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో షమీకి విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. భారత్ రాబోయే రోజుల్లో వన్డే, టెస్టు మ్యాచ్ లు ఆడుతుంది. జస్ప్రిత్ బ్రుమా అందుబాటులో లేకపోవటంతో మహ్మద్ షమీ భారత్ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించాల్సిఉంటుంది. ఈ క్రమంలో అతనిపై ఒత్తిడిలేకుండా పలు మ్యాచ్ లకు విశ్రాంతి కల్పించే యోచనలో టీమిండియా మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, షమీ స్థానంలో లెఫ్మార్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌కు తుదిజట్టులో అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది.

Ind Vs SL 1st ODI : శ్రీలంకతో తొలి వన్డేలో భారత్ విజయం, చివర్లో సెంచరీతో చెలరేగిన శనక

మూడోవన్డేలో 11మంది ప్లేయర్లలో యువ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ స్థానంలో ఎడమచేతి బ్యాటర్ ఇషాన్ కిషన్ ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టడంపట్ల టీం మేనేజ్‌మెంట్‌పై పలువురి నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈక్రమంలో ఇషాన్ కిషన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్‌ను తుదిజట్టులో తీసుకొనే అవకాశాలు ఉంటాయని పలువురు మాజీలు అంచనా వేస్తున్నారు.