Telangana Formation Day: నేడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. పబ్లిక్ గార్డెన్స్‌లో కేసీఆర్.. ఢిల్లీలో అమిత్ షా..

ఎంతోమంది పోరాటం. మరికొందరి బలి దానం. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. నేటితో తెలంగాణకు ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. 2014లో జూన్ 2న కొత్త రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అప్పటి నుంచి ప్రతీయేటా జూన్2న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తుంది.

Telangana Formation Day: నేడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. పబ్లిక్ గార్డెన్స్‌లో కేసీఆర్.. ఢిల్లీలో అమిత్ షా..

Tealgana Farmation Day

Telangana Formation Day: ఎంతోమంది పోరాటం. మరికొందరి బలి దానం. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది. నేటితో తెలంగాణకు ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. 2014లో జూన్ 2న కొత్త రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అప్పటి నుంచి ప్రతీయేటా జూన్2న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ వస్తుంది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ ఏడాది కరోనా వ్యాప్తి తగ్గిపోవటంతో పాటు కొవిడ్ ఆంక్షలు తొలగిపోవడంతో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Telangana formation day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్ష‌లు: తమిళిసై

తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో గురువారం రాష్ట్ర స్థాయిలో జరిగే ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గోనున్నారు. ఉదయం 9గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం ఎనిమిదేళ్ల తెలంగాణ ప్రస్థానంలో తెరాస ప్రభుత్వం హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ వివరించనున్నారు. అంతకుముందు సీఎం కేసీఆర్ గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళి అర్పించనున్నారు. అదేవిధంగా రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం రాజ్ భవన్ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ జరిగే ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొంటారు.

Telangana Covid Update : తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే

ఈ సందర్భంగా ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు దర్బార్ హాల్ లో అందుబాటులో ఉండి సామాన్య ప్రజలు, వివిధ రంగాల ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు అందుకోనున్నారు. అనంతరం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో అద్భుతంగా రాణించిన 12 మందిని గవర్నర్ సన్మానిస్తారు. ఇదిలా ఉంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలోనూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో జరగనున్న ఈ వేడుకల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఏర్పాట్లు చేశారు. గ్రామగ్రామాన ఆవిర్భావ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించనున్నారు.