Naveen Chandra: తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో.. బేబీ మూన్ అంటూ ట్వీట్!

వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న నవీన్ చంద్ర తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తాను తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. వాలంటైన్స్ డే సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

Naveen Chandra: తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో.. బేబీ మూన్ అంటూ ట్వీట్!

Naveen Chandra: పదేళ్ల క్రితం వచ్చిన ‘అందాల రాక్షసి’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన నవీన్ చంద్ర ఇటు హీరోగా, అటు విలన్‌గా మెప్పిస్తున్నాడు. అవకాశం దొరికితే ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల నటుడు. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న నవీన్ చంద్ర తాజాగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు.

I-T Survey On BBC: బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు.. ప్రతిపక్షాల ఆగ్రహం

తాను తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. వాలంటైన్స్ డే సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ‘‘బేబీ మూన్.. నిన్ను నా చేతుల్లోకి తీసుకునేందుకు ఎదురు చూస్తున్నా. తల్లిదండ్రులం కాబోతున్నందుకు చాలా ఉత్సాహంగా ఉంది. కొత్త దశ.. కొత్త జీవితం.. కొత్త అధ్యాయం.. 2023కు కొత్త స్వాగతం’’ అంటూ నవీన్ చంద్ర ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా తన భార్యతో ఉన్న బేబీ బంప్ ఫొటోలను కూడా షేర్ చేశాడు.

Renu Desai: అనారోగ్యంపై సంచలన ప్రకటన చేసిన రేణూ దేశాయ్.. సోషల్ మీడియాలో వెల్లడించిన నటి

ఈ ట్వీట్‌పై నవీన్ అభిమానులు, ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నవీన్ చంద్ర దంపతులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం నవీన్ చంద్ర రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే వీర సింహారెడ్డి చిత్రంలోనూ నటించి మెప్పించారు.