ఎంతటి స్టార్ హీరోలైనా వీళ్లు చెప్పినట్టు వినాల్సిందే..

ఎంతటి స్టార్ హీరోలైనా వీళ్లు చెప్పినట్టు వినాల్సిందే..

Fitness Trainers: స్మార్ట్‌గా ఉండే సిక్స్ ప్యాక్ అయినా, స్ట్రాంగ్‌గా కనిపించే మస్కులర్ బాడీ అయినా.. వీళ్లు లేనిదే కనిపించవు.. ఎంత స్టార్ హీరోలైనా వీళ్లు చెప్పినట్టు వినాల్సిందే. వీళ్లు తినమనాల్సింది తినాల్సిందే. లేదంటే పనిష్మెంట్ తప్పదు. మరి మన టాప్ హీరోల ఫిజిక్ వెనక కనిపించని ఆ స్ట్రాంగ్ హీరోస్, ఫిట్‌నెస్ ట్రైనర్స్ ఎవరో డీటెయిల్డ్‌గా చూద్దాం.

ఈ బాడీ అంత తేలిగ్గా వచ్చింది కాదు.. మన్నెందొర ఫుల్ మస్కులర్ బాడీతో కనిపించడానికి చాలా కష్టపడ్డారు. కాదు కాదు.. చాలా కష్టపెట్టారు ట్రైనర్స్. రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి అల్లూరి సీతారామరాజు బాడీ వెనక ఉన్న ఆ ఫిట్‌నెస్ ట్రైనర్.. రాకేష్ వడియార్. బాలీవుడ్‌లో స్టార్ హీరోలకి ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పనిచేసిన రాకేష్‌తోనే ట్రిపుల్ ఆర్ సినిమా లుక్ తెప్పించుకున్నారు రామ్ చరణ్. ఎంత కష్టపడి వర్కవుట్ చేసినా కరెక్ట్ ట్రైనింగ్ లేకపోతే వేస్ట్. అందుకే చరణ్ కొన్ని సినిమాల నుంచి రాకేష్‌తోనే తన వర్కవుట్ సెషన్స్‌ని, బాడీ టోనింగ్‌ని కంటిన్యూ చేస్తున్నారు.

Ram Charan

ట్రిపుల్ ఆర్‌లోనే మరో హీరో ఎన్టీఆర్‌కి కూడా మజిల్ పవర్ కోసం, సూపర్ మస్కులర్ టోన్డ్ బాడీ కోసం బాగా కష్టపెట్టారు లాయిడ్ స్టీవెన్స్. ఈ ఫారెన్ కోచ్ బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్‌కి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో హెల్ప్ అయ్యాడు. తెలుగులో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫిజికల్ ట్రైనింగ్‌తో పాటు మెంటల్‌గా ఫిట్‌నెస్‌ని అందిస్తున్నాడు. అసలేమాత్రం డుమ్మా కొట్టకుండా ఎన్టీఆర్ చేత కష్టమైనా సరే ఎంకరేజ్ చేస్తూ.. తన ఫిట్‌నెస్ గోల్స్‌ని రీచ్ అయ్యేలా సూపర్ ఫిట్ బాడీని మెయింటెన్ చేయిస్తున్నారు స్టీవెన్స్.

NTR

లేటెస్ట్‌గా ‘లైగర్’ సినిమాకోసం విజయ్ దేవరకొండ అంతకు ముందెప్పుడూ లేనంత ఫిట్‌నెస్ వర్కవుట్స్ చెయ్యాల్సొస్తోంది. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘లైగర్’ మూవీలో థాయ్‌‌లాండ్‌లో 15 మంది డిఫరెంట్ ట్రెనర్స్‌తో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు విజయ్. ఇక ఫిట్‌నెస్ విషయానికొస్తే.. సెలబ్రిటీ ట్రైనర్ అయిన కుల్‌దీప్ సేథీ తో తన బాడీని కుస్తీలు పట్టిస్తున్నాడు విజయ్.

Vijay Deverakonda

యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా ట్రైనింగ్‌లో బిజీగా ఉన్నారు. వరుణ్ తన అప్ కమింగ్ మూవీ ‘గని’ కి సంబంధించి బాక్సింగ్ ట్రైనింగ్‌ని ఇంగ్లండ్ బాక్సర్ డేవిడ్ టోనీ జెఫ్రిస్ దగ్గర తీసుకుంటున్నాడు. లాక్‌డౌన్ టైమ్‌లో ఫుల్‌గా ప్రాక్టీస్ చేస్తూ.. ట్రెయిన్ అయ్యారు వరుణ్. 2008 ఒలింపిక్స్‌లో మెడల్ సాధించిన టోనీ జెఫ్రిస్ వరుణ్‌కి బాక్సింగ్‌లో అవుట్ అండ్ అవుట్ ట్రైనింగ్‌తో సినిమాకి కావల్సిన లుక్ తెప్పించారు. ఇలా స్టార్ హీరోలు తమ లుక్ కోసం, క్యారెక్టర్ కోసం కష్టపడుతుంటే.. వాళ్లకు కావల్సిన లుక్‌ని తెప్పించడానికి వాళ్లని ట్రెయిన్ చేస్తున్నారు ఈ స్టార్ ట్రైనర్స్.

Varun Tej