Tomato Pack : ముఖంపై నలుపును తొలగించే టొమాటో ప్యాక్!

ఒక ముక్క టొమాటో రసానికి చెంచా కొత్తిమీర రసం కలుపుకోవాలి. చిక్కగా చేసుకుని దానికి కొంచెం ముల్తానీ మట్టి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి.

Tomato Pack : ముఖంపై నలుపును తొలగించే టొమాటో ప్యాక్!

Tomato Pack

Tomato Pack : ముఖంపై నల్లదనాన్ని పోగొట్టుకునేందుకు చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ వాటి వల్ల సరైన ఫలితం ఉండదు. అలాంటి వారికి టొమాటో చక్కగా ఉపకరిస్తాయి. అందాన్ని పెంచి చర్మాన్ని కాంతి వంతం చేయటంలో టొమాటో బాగా తోడ్పడుతుంది. టొమాటోను వివిధ రూపాల్లో ఉపయోగించి ముఖాన్ని మృధువుగా మార్చుకోవచ్చు. టొమాటోతో ముఖాన్ని ఎలా అందంగా మార్చుకోవచ్చు, నలుపుదనాన్ని ఎలా పోగొట్టుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఒక తాజా టొమాటో మద్యలోకి కోసం ఆముక్కని పంచదారలో అద్దాలి. దానిపై కొద్దిగా చిక్కని పెరుగు వేసి దాంతో ముఖం రుద్దుకుంటే మృతకణాలు తొలగిపోతాయి. ముఖంపై పేరుకున్న నలుపుదనమూ నెమ్మిగా పోతుంది. ఒక ముక్క టొమాటో రసం, ఒక చెక్క నిమ్మరసం, కొద్దిగా పెరుగు కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. అందులో కొంచెం శెనగపిండి, కొంచెం ముల్తానీ మట్టి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ ప్రాంతాల్లో ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే నలుదనం తొలగిపోతుంది. చర్మం తాజాగా ఉంటుంది.

అలాగే ఒక ముక్క టొమాటో రసానికి చెంచా కొత్తిమీర రసం కలుపుకోవాలి. చిక్కగా చేసుకుని దానికి కొంచెం ముల్తానీ మట్టి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం కాంతి వంతంగా ఉండటంతోపాటు, మొటిమల సమస్య తొలగిపోతుంది.

రెండు చెంచాల టమాట గుజ్జు తీసుకోవాలి. ఇందులో కాస్తా తేనె కలపాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని ముఖం, మెడని శుభ్రం చేసుకుని ముఖంపై అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత తేమ అందుతుంది. కొద్దిగా టమాట రసం తీసుకుని అందులో కాస్తా మజ్జిగ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగితే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని రాయడం వల్ల ట్యాన్ సమస్య తగ్గుతుంది.