Tomota Fever : కేరళను కలవర పెడుతున్న టమోటా ఫీవర్
కేరళలో కొత్తరకం వైరస్ కలవరం పుట్టిస్తోంది. టమోటా ఫ్లూ అనే వైరస్ ముఖ్యంగా చిన్నపిల్లల తల్లితండ్రులను భయపెడుతోంది.

Tomiota Fever In Kerala
Tomota Fever : కేరళలో కొత్తరకం వైరస్ కలవరం పుట్టిస్తోంది. టమోటా ఫ్లూ అనే వైరస్ ముఖ్యంగా చిన్నపిల్లల తల్లితండ్రులను భయపెడుతోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు కేరళ వ్యాప్తంగా 80 మంది చిన్నపిల్లలు ఈ వైరస్ బారిన పడ్డారు. దీంతో పొరుగును ఉన్న తమిళనాడు లో కూడా ఆందోళన నెలకొంది.
రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాలలో అధికారులు పరీక్షలు చేపడుతున్నారు. కోయంబత్తూరులో రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న వారికి ఫీవర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు, కేరళ సరిహద్దుల్లో పరీక్షలు నిర్వహించి ఫ్లూ లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారు. టమోటా ఫీవర్ సోకిన చిన్నారుల్లో దద్దుర్లు, ఒంంటిపై దురదలు, డీహైడ్రేషన్ వంటి లక్షణాలు ఏర్పడుతున్నాయని కేరళ వైద్యశాఖ అధికారులు చెప్పారు.
టమోటా ఫీవర్ వైరల్ ఫీవరా..లేక.. చికెన్ గున్యా, డెంగ్యూ ఫీవర్ తర్వాత వచ్చే జ్వరమా అనే దానిపై కేరళలో పరిశోధనలు జరుగుతున్నాయి. శరీరం ఎరుపు రంగులోకి మారి బొబ్బలు ఎక్కటంతో దీనికి టమోటా ఫ్లూ అనే పేరు వచ్చిందని చెపుతున్నారు.
Also Read : TCS Courses : ఉచిత కెరీర్ కోర్సులు అందించనున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్