Amritpal Singh: పోలీసులు తీవ్ర వేట నేపథ్యంలో అమృతపాల్ సింగ్‭కు సిక్కు సంఘం పిలుపు

అమృతపాల్ సింగ్‭కు సహకరించిన వారిని ఒక్కక్కరిని పోలీసులు గుర్తిస్తున్నారు. అందులో కొంత మందిని అరెస్ట్ చేస్తున్నారు. కార్లలో బైకుల మీద అమృతపాల్ సింగ్‭ తప్పించుకుని తిరుగుతున్నారు. గురుద్వారాల్లో బట్టలు మార్చుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సిక్కు సంప్రదాయ వేషధారణలో కాకుండా మాడ్రన్ బట్టల్లో తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అతడికి సంబంధించిన కొన్ని వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Amritpal Singh: పోలీసులు తీవ్ర వేట నేపథ్యంలో అమృతపాల్ సింగ్‭కు సిక్కు సంఘం పిలుపు

Top Sikh body Akal Takht send message to Amritpal Singh

Amritpal Singh: వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్‭ను పట్టుకోవడానికి సుమారు 80 వేల మంది పోలీసులు వారం రోజులుగా తీవ్ర గాలింపులు చేస్తున్న నేపథ్యంలో సిక్కులకు పవిత్రమైన అకాల్ తక్త్ అనే సంస్థ నుంచి అతడికి శనివారం ఒక పిలుపు వచ్చింది. అమృతపాల్ సింగ్‭ తక్షణమే పోలీసుల ఎదుట లొంగిపోవాలని అకాల్ తక్త్ చీఫ్ హర్ ప్రీత్ సింగ్ అన్నారు. ఇదే సమయంలో పోలీసుల పనితీరుపై ఆయన సున్నిత విమర్శ చేశారు. అంత పెద్ద దళాన్ని పెట్టుకుని అమృతపాల్ సింగ్‭ను అరెస్ట్ చేయకపోవడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

CM KCR : అప్పటివరకూ.. మహారాష్ట్రకు వస్తూనే ఉంటా-నాందేడ్ సభలో కేసీఆర్

ఈ విషయమై ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘అమృతపాల్ సింగ్‭ బయటే ఉంటే పోలీసుల ఎదుట హాజరై విచారణకు సహకరించాలని కోరేవాడిని. పంజాబ్ రాష్ట్రంలో అంత మంది పోలీసులు ఉన్నా అమృతపాల్ సింగ్‭ను ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇది పోలీసుల పనితీరుపై సందేహాలను రేకెత్తిస్తోంది. ఒక వేళ ఇప్పటికే అమృతపాల్ సింగ్‭ను అరెస్ట్ చేస్తే, పోలీసులు ఆ విషయాన్ని ప్రకటించాలి. ఇప్పటికే అమృతపాల్ సింగ్‭ను అరెస్ట్ చేసినట్లు అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితిపై చర్చించేందుకు దాదాపు 70 సిక్కు సంస్థలతో సమావేశం కావాలి’’ అని హర్ ప్రీత్ సింగ్ అన్నారు.

Shatrughan Sinha: రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినందుకు మోదీకి థాంక్స్ చెప్పిన టీఎంసీ ఎంపీ శత్రుఘన్ సిన్హా

కాగా, అమృతపాల్ సింగ్‭కు సహకరించిన వారిని ఒక్కక్కరిని పోలీసులు గుర్తిస్తున్నారు. అందులో కొంత మందిని అరెస్ట్ చేస్తున్నారు. కార్లలో బైకుల మీద అమృతపాల్ సింగ్‭ తప్పించుకుని తిరుగుతున్నారు. గురుద్వారాల్లో బట్టలు మార్చుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సిక్కు సంప్రదాయ వేషధారణలో కాకుండా మాడ్రన్ బట్టల్లో తిరుగుతున్నట్లు తెలుస్తోంది. అతడికి సంబంధించిన కొన్ని వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.