Revanth Reddy: తెలంగాణలో రైతులకు రూ.వేల కోట్లు నష్టం: కేంద్రానికి రేవంత్ లేఖ

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బాధ్యతా రాహిత్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

Revanth Reddy: తెలంగాణలో రైతులకు రూ.వేల కోట్లు నష్టం: కేంద్రానికి రేవంత్ లేఖ

Revanth

Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ బాధ్యతా రాహిత్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఈమేరకు రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలను ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, సీబీఐ డైరెక్టర్లకు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రబీ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనిశ్చితి, గందరగోళం, ఆలస్యం వల్ల ధాన్యం సేకరణలో రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయారని రేవంత్ అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టమైన వైఖరి లేకపోవడం వల్ల మధ్య దళారులకు, మిల్లర్లకు రైతులు పంట అమ్ముకోవాల్సి వచ్చిందని ప్రభుత్వ ఉదాసీనత వల్ల దాదాపు 35% నుండి 40% మంది రైతులు దోపిడీకి గురయ్యారని ప్రధానికి రాసిన లేఖలో రేవంత్ వివరించారు.

Also read:Minister Kakani : మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రైతులకు రూ. 3000-4000 కోట్లు నష్టం వాటిల్లిందని ఇది సీఎం కేసీఆర్ చాలా బాధ్యతా రహిత్యానికి నిదర్శనమని రేవంత్ పేర్కొన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని రేవంత్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వరి విషయంలో గందరగోలం సృష్టించడం తో రైతులు తీవ్రంగా నష్టపోయారని..ప్రత్యామ్నాయ పంటలకు మద్దతు ధరలు ప్రకటించి ఉంటే రైతులకు కొంత లాభం జరిగేదని రేవంత్ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో కొందరు రైస్ మిల్లర్లు ఎఫ్.సి.ఐ నుంచి ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వలేదని, ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినా చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Also read:Kishan Reddy: వడ్లకు సంచుల్లేవ్.. తండ్రీ కొడుకులు తట్టలో తీసుకొస్తారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

“ఎఫ్.సి ఐకి మిల్లర్లు ఇవ్వాల్సిన బియ్యం నల్ల బజారుకు తరలించారా?.. విదేశాలకు అమ్మకున్నారా?” అని మంత్రి కిషన్ రెడ్డే ప్రశ్నించారని..అవి నిజమని అనుమానాలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. ఎఫ్.సి.ఐ బియ్యం విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేవనెత్తిన అనుమానాలపై వెంటనే సీబీఐ విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 28 మార్చి 2022 నాటి విచారణలో రైస్ మిల్లులలో సుమారుగా వేల మెట్రిక్ టన్నుల ఎఫ్.సి.ఐ బియ్యం లేకుండా పోయాయ బియ్యం విషయంలో వేల కోట్ల అవినీతి జరిగిందని కిషన్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారని దీన్ని ఆధారంగా చేసుకునే తామూ సీబీఐ విచారణ కోరుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన లేఖలో వివరించారు.

Also read:KTR :గ్యాస్ ధరలు తగ్గిస్తానన్న మోదీ డబుల్ చేశారు: మంత్రి కేటీఆర్