Kishan Reddy: వడ్లకు సంచుల్లేవ్.. తండ్రీ కొడుకులు తట్టలో తీసుకొస్తారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

రాష్ట్రంలో కొన్ని రైస్ మిల్లులో ఉండాల్సినంత దాన్యం లేదు, అసలు ధాన్యం నింపేందుకు గోనెసంచులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని కిషన్ రెడ్డి అన్నారు

Kishan Reddy: వడ్లకు సంచుల్లేవ్.. తండ్రీ కొడుకులు తట్టలో తీసుకొస్తారా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy1

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ తెలంగాణ రైతులను మోసం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో కొన్ని రైస్ మిల్లులో ఉండాల్సినంత దాన్యం లేదు..రైస్ మిల్లులలో అవకతవకలు జరిగాయని అన్నారు. ఎఫ్.సి.ఐ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 40 రైస్ మిల్లులో తనిఖీలు చేశారని..4,53,890 లక్షల సంచుల ధాన్యం తక్కువగా ఉన్నట్లు అధికారులు తేల్చారని.. ఆ ధాన్యం ఎక్కడకు తరలించారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైస్ మిల్లుల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుందని కిషన్ రెడ్డి విమర్శించారు.

Also read:Telangana : తెలంగాణ రాష్ట్ర సర్కార్‌‌పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

తక్కువ ధాన్యం ఉండటంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అలెర్ట్ చేశామన్న ఆయన..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైస్ మిల్లులపై తనిఖీలు చేయాలని రాష్ట్ర ప్రభత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన రైసు మిల్లులపై ఏలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ కోరుతు త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోమారు లేఖ రాయనున్నట్లు కిషన్ రెడ్డి వివరించారు. తమ వద్దనున్న బియ్యాన్ని కొనాలంటూ ఏప్రిల్ 13న తెలంగాణ సివిల్ సప్లయ్ కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారని, కేంద్రం వెంటనే స్పందించి ఆమోదించిందని ఆయన గుర్తుచేశారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు రైతులనుంచి ధాన్యాన్ని కొనుగోలు చెయ్యలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఘర్షణ వాతావరణం సృష్టించిందన్నా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల జీవితాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుకుంటుందని ధ్వజమెత్తారు.

Also read:Covid-19: మాస్క్ లేకపోతే ఫైన్.. మళ్లీ అమల్లోకొచ్చిన నిబంధన!

కేంద్రం వద్ద అన్ని రాష్ట్రాలకూ ఒకే న్యాయం ఉంటుందని..అగ్రిమెంట్ ప్రకారమే అన్ని రాష్ట్రాల నుంచి ధాన్యం కోనుగోలు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో బాయిల్డ్ రైస్ కోనుగోలు చేయబోమని అన్ని రాష్ట్రాలకు లేఖ రాసినట్లు వివరించారు. సీఎం కేసీఆర్ కావాలనే ఉద్దేశ పూర్వకంగా ప్రధానినీ తిట్టడం.. “దేశం నుంచి తరిమి కొడతామని పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. ఢిల్లీలో, రాష్ట్రంలో, గ్రామాల్లో ఆందోళన నిర్వహించారు. బీజేపీని బంగాళాఖాతంలో కలువుతామని మాటలు మాట్లాడి, ఇతర రాష్ట్రాల సీఎంలు, పార్టీ నేతలతో ఫోన్ లో మాట్లాడారు” ఇంత చేసి కేసీఆర్ రైతులకు చేసిందేమిటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హుజూరబాద్ ఎన్నికల ఓటమి బరించలేక కేసీఆర్ కేంద్రంపై నిందలు వేస్తున్నారన్న కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మరచి కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం తగదని అన్నారు. సుభిక్షంగా ఉన్న తెలంగాణ రాష్ట్రన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం రావణ కాష్టంగా మార్చిందని దుయ్యబట్టారు.

Also read:Praja Sangrama Padayatra : ఆ ప్రాజెక్టుకు డీపీఆర్ ఎందుకివ్వడం లేదు కేంద్ర మంత్రి ప్రశ్న

రాజకీయాలు చేయాలనుకుంటే వేరే అంశాలు ఉన్నాయని..తండ్రీ, కొడుకులు రైతులపై రాజకీయాలు చేయడం మానుకోవాలని కిషన్ రెడ్డి చురకలంటించారు. ధాన్యానికి కేంద్రం రూ.1960లు మద్దతు ధర నిర్ణయించిందని, 2020-21 యాసంగి, రబీ ధాన్యాన్ని ఒప్పందం ప్రకారం కేంద్రానికి ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఇంతవరకు ఇవ్వలేదన్నారు. దానిపై ఐదు సార్లు లేఖ రాసినా స్పందన లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో 900 పై చిలుకు రా రైస్ చేసే మిల్లులు ఉన్నాయని, 40 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ ఇస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయగా.. అసలు ధాన్యం నింపేందుకు గోనెసంచులు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 15 కోట్ల గోనె సంచులు అవసరం ఉండగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేవలం కోటి గోనె సంచులు మాత్రం ఉన్నయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గోనె సంచులు లేకుండా ధాన్యం ఎలా కొనుగోలు చేస్తారని ప్రశ్నించిన కిషన్ రెడ్డి..తండ్రీకొడుకులు తట్టలో తీసుకువస్తారా..? అంటూ ఎద్దేవా చేశారు.

Also read:KTR :గ్యాస్ ధరలు తగ్గిస్తానన్న మోదీ డబుల్ చేశారు: మంత్రి కేటీఆర్