BAIL: పోడు భూముల కేసు.. ఆదివాసి మహిళలకు బెయిల్, విడుదల

అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులు అటవీ భూమిలో సాగు చేసేందుకు చెట్లను నరికివేస్తున్నారని అధికారులు ఆరోపించారు. చెట్లను నరికివేయకుండా అటవీ అధికారులు అడ్డుకున్నారు. అక్రమంగా పోడు సాగు చేస్తున్నారని 24 మందిపై కేసు నమోదు చేశారు.

BAIL: పోడు భూముల కేసు.. ఆదివాసి మహిళలకు బెయిల్, విడుదల

Bail

BAIL: ఇటీవల పోడు భూముల కేసులో అరెస్టైన ఆదివాసి గిరిజన మహిళలకు తాజాగా బెయిలు లభించింది. దీంతో మహిళలను అధికారులు జైలు నుంచి బుధవారం విడుదల చేశారు. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం కోయపోశ గూడెం గ్రామ పరిధిలో గతవారం పోడు భూములకు సంబంధించి వివాదం తలెత్తింది. అటవీ ప్రాంతంలో నివాసం ఉంటున్న గిరిజనులు అటవీ భూమిలో సాగు చేసేందుకు చెట్లను నరికివేస్తున్నారని అధికారులు ఆరోపించారు. చెట్లను నరికివేయకుండా అటవీ అధికారులు అడ్డుకున్నారు. అక్రమంగా పోడు సాగు చేస్తున్నారని 24 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో 12 మంది ఆదివాసి మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.

Cheetah: భారత్‌ రానున్న చీతాలు.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి

అనంతరం వీరిని ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. జైళ్లో రిమాండ్‌లో ఉన్న మహిళలకు బెయిల్ తీసుకొచ్చేందుకు మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో, పార్టీ నాయకులు ప్రయత్నించారు. తాజాగా కోర్టు బెయిలు మంజూరు చేయడంతో, బెయిల్ పత్రాలను తీసుకొచ్చి జైలు అధికారులకు అందించారు. వీటిని పరిశీలించిన అధికారులు వెంటనే 12 మంది మహిళలను విడుదల చేశారు.