KCR : పీయూష్ గోయల్ కాదు.. ఆయన గోల్ మాల్: కేసీఆర్

తెలంగాణలోనూ ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. ఇందుకు 24 గంటల సమయం ఇస్తున్నట్లు.. స్పందన రాకపోతే.. ఏమి చేయాలో అది చేస్తామని హెచ్చరించారు.

KCR : పీయూష్ గోయల్ కాదు.. ఆయన గోల్ మాల్: కేసీఆర్

Kcr Nirasana

TRS Protest On Delhi : తెలంగాణ రాష్ట్ర ధాన్యం విషయంలో ప్రశ్నిస్తే.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు..ఎందుకింత అహంకారం.. పీయూష్ గోయల్ కాదు.. గోల్ మాల్ అని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. రైతులతో పెట్టుకోవద్దని.. వారి కన్నీళ్లు పెట్టుకుంటే.. వారి ప్రభుత్వం ఉండదని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రభుత్వంలో ఎవరూ శాశ్వతం కాదని.. రైతులను అవమానపరంగా చూస్తుండడం తమకు నచ్చలేదన్నారు. తమ ప్రభుత్వానికి చెందిన మంత్రులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిస్తే.. అవమానపరిచే విధంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. పార్లమెంట్ లో ఎంపీ కేశవరావు మాట్లాడుతుంటే.. అహంకారంగా పీయూష్ గోయల్ వ్యాఖ్యలు చేశారన్నారు.

Read More : KCR In Delhi : ధాన్యం దంగల్.. ఢిల్లీ వేదికగా గర్జించిన కేసీఆర్, 24 గంటల డెడ్ లైన్

తెలంగాణ ప్రజలకు నూకలు అలవాటు చేయమని పీయూష్ గోయల్ అన్నారని.. రైతుల విషయంలో అలా ఎవరైనా మాట్లాడుతారా నిలదీశారు. అగ్రికల్చర్ పాలసీ రూపొందించాలని.. తాము మద్దతు ఇస్తామన్నారు. కానీ పక్షంలో..తాము ముందుకు వచ్చి.. బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా కార్యచరణ రూపొందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం ముందుకు వచ్చి పోరాటం చేస్తే.. వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. 2022, ఏప్రిల్ 11వ తేదీ సోమవారం తెలంగాణ భవన్ ప్రాంగంణంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టనుంది. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఈ దీక్ష జరిగింది. భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

Read More : CM KCR : ఢిల్లీలో టీఆర్ఎస్ మహాధర్నా.. కేసీఆర్ కీలక ప్రకటన చేసే ఛాన్స్!

ఢిల్లీకి ఎందుకు వచ్చాం ? ఎందుకు ఇక్కడకు రావాల్సి వచ్చింది ? తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు ? అని ప్రశ్నించారు. ఏపీ నుంచి విడిపోయిన సమయంలో.. ఎన్నో సమస్యలు నెలకొన్నాయన్నారు. రాష్ట్రంలో కరెంటు లేక.. నీళ్లు లేక అల్లాడిపోయాయరని, మహబూబ్ నగర్ నుంచి ఎంతో మంది వలస వెళ్లారని గుర్తు చేశారు. ఆరు దశాబ్దాల నుంచి తెలంగాణ రాష్ట్రం కావాలని పోరాటం జరిగిందని, 1969 సంవత్సరంలో జరిగిన పోరాటంలో నలుగురు యువకులు చనిపోయారన్నారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత గులాబీ జెండా ఉద్యమం సాగించిందని, రాష్ట్రం ఆవిర్భావం ఎందుకు కావాలో.. దేశంలో ఎంతో మంది పార్టీ నేతలకు తాము చెప్పడం జరిగిందన్నారు. గతంలో కరెంటు సమస్య ఉంటే.. ఇప్పుడు 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు కొన్ని లక్షల బోర్ వెల్ నడుస్తున్నట్లు రాకేష్ టికాయత్ కు తెలిపారు.

Read More : Paddy Issue : ఢిల్లీలో టీఆర్ఎస్ ధాన్యం దంగల్.. కేంద్రం దిగొస్తుందా ?

రాకేష్ టికాయత్ పై కేంద్ర సర్కార్ ఎన్నో విమర్శలు చేసిందని, ఎన్ని ఆటంకాలు పెట్టినా.. ఉద్యమాన్ని మాత్రం ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. ఇలాంటి పోరాటం దేశంలో ఎక్కడా జరగలేదని, ఈ క్రమంలో.. ప్రధాన మంత్రి ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పారన్నారు. కానీ.. ఎన్నికల విషయంలో ఆయన క్షమాపణలు చెబుతారని.. ఎద్దేవా చేశారు. మిగతా రాష్ట్రాల మాదిరిగా తెలంగాణలోనూ ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. ఇందుకు 24 గంటల సమయం ఇస్తున్నట్లు.. స్పందన రాకపోతే.. ఏమి చేయాలో అది చేస్తామని హెచ్చరించారు సీఎం కేసీఆర్.