KCR In Delhi : ధాన్యం దంగల్.. ఢిల్లీ వేదికగా గర్జించిన కేసీఆర్, 24 గంటల డెడ్ లైన్

ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ గర్జించారు...24 గంటల సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం తాము ఎలాంటి చర్యలు తీసుకుంటామో వేచి చూడాలని...

KCR In Delhi : ధాన్యం దంగల్.. ఢిల్లీ వేదికగా గర్జించిన కేసీఆర్, 24 గంటల డెడ్ లైన్

Kcr In Delhi

TRS Protest In Delhi : ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ గర్జించారు. ముఖ్యమంత్రులను జైలుకు పంపుతామని బెదిరిస్తారని.. దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర ధాన్యం కొనుగోళ్ల విషయంలో వెంటనే స్పందించాలని.. ఇందుకు 24 గంటల సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం తాము ఎలాంటి చర్యలు తీసుకుంటామో వేచి చూడాలని, భూకంపం సృష్టిస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు..ఈ పార్టీకి చెందిన నేతలు ఏమి చేశారో కుండబద్ధలు కొడుతామని హెచ్చరించారు.

Read More : CM KCR : ఢిల్లీలో టీఆర్ఎస్ మహాధర్నా.. కేసీఆర్ కీలక ప్రకటన చేసే ఛాన్స్!

ప్రశ్నించిన వారిపై ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తోందని.. ఇలా చేయడం పద్ధతి కాదని.. తాము ఇప్పటికే పోరాటం చేసేందుకు ముందుకు వచ్చామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ముందుకు వచ్చిన తర్వాత.. వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. 2022, ఏప్రిల్ 11వ తేదీ సోమవారం తెలంగాణ భవన్ ప్రాంగంణంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టనుంది. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఈ దీక్ష జరిగింది. భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేష్ టికాయత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు.

Read More : Paddy Issue : ఢిల్లీలో టీఆర్ఎస్ ధాన్యం దంగల్.. కేంద్రం దిగొస్తుందా ?

బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం విషయంలో తాము ఎంతకైనా పోరాడుతామని కేంద్రానికి హెచ్చరించారు. తమ రాష్ట్రానికి చెందిన రైతులను కాపాడుకుంటామని.. రైతుల విషయంలో బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తోందని.. దేశంలో ఎవరితోనైనా పెట్టుకోండి.. కానీ రైతులతో పెట్టుకోవద్దని.. ఏ ప్రభుత్వం కూడా ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రాల నేతలను అందరినీ కలుపుకొని పోదామని, మద్దతు ధర విషయంలో పోరాటం చేద్దామన్నారు. ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రులు, నేతలతో మాట్లాడుతామని.. ఈ విషయంలో ముందుకు వచ్చిన వారంతా రాకేష్ టికాయత్ మద్దతిస్తామని వెల్లడించారు.