Tirumala : టీటీడీ సంచలన నిర్ణయం-టోకెన్ లేకుండానే శ్రీవారి దర్శనం

టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పిస్తోంది. ఈ రోజు తిరుపతిలోనిఉదయం సర్వ దర్శనంటోకెన్ల జారీ నేఫధ్యంలో జరిగిన తొక్కిసలాటతో టీటీడీ ఈ నిర

Tirumala : టీటీడీ సంచలన నిర్ణయం-టోకెన్ లేకుండానే శ్రీవారి దర్శనం

Tirumala Piligrims

Tirumala : టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టోకెన్లు లేకుండానే శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పిస్తోంది. ఈ రోజు తిరుపతిలోనిఉదయం సర్వ దర్శనంటోకెన్ల జారీ నేఫధ్యంలో జరిగిన తొక్కిసలాటతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. భక్తులు ఆధారా కార్డ్ చూపించి దర్శనానికి వెళ్ళిపోవచ్చని టీటీడీ ప్రకటించింది. ఈరోజు ఉదయం నుంచి  భక్తుల కష్టాలపై 10 టీవీ ప్రసారం చేసిన వరస కధనాలతో టీడీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

తిరుమలలో అధిక రద్దీ కారణంగా రేపటి నుంచి  ఆదివారం వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలను టీడీడీ రద్దు చేసింది.  కేవలం సామాన్య భక్తులు, ప్రత్యేక ప్రవేశం టికెట్లు కలిగిన భక్తులకు మాత్రము ఈ ఐదు రోజులు పూర్తి స్ధాయిలో దర్శనాలు కల్పించనున్నారు.

శ్రీవారి దర్శనం కోసం టీటీడీ ఈరోజు విడుదల చేసే సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని రెండో సత్రం, అలిపిరి వద్దవేల సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇసుకవేస్తే రాలనంతగా భక్తులు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప కంచెను తోసుకుని లోనికి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. భక్తులు ఒకరిపై ఒకరు కిందపడిపోయారు. దీంతో ముగ్గురు భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రూయా ఆస్పత్రికి తరలించారు.

టీటీడీ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందనే విమర్శలు వినిపించాయి. టీటీడీ భక్తుల రాకను సరిగ్గా అంచనా వేయలేకపోతోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీరు లేక వందలాది మంది భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. మండుటెండల్లో వస్తున్న భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని భక్తులు . చంటిబిడ్డలతో వచ్చిన భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడటంతో టీటీడీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

చంద్రబాబు ఆగ్రహం
తిరుమల సర్వదర్శనం టోకెన్ల కోసం తిరుపతిలో భక్తుల తొక్కిసలాటపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది భక్తులు గంటల తరబడి పసిబిడ్డలతో మండుటెండలో అవస్థలు పడుతుంటే టీటీడీ ఏమి చేస్తోంది? భక్తులకు సౌకర్యాలు కల్పించకపోవడం దారుణం అని ఆయన మండి పడ్డారు.

టీటీడీ భక్తుల పట్ల నిర్లక్ష్యంవహించటాన్ని ఆయన ప్రశ్నించారు. టీటీడీ నిర్ణయాలు శ్రీవారిని భక్తులకు దూరం చేసేలా ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారు. కొండపైకి వెళ్ళటానికి కూడా ఆంక్షలు విధించటం భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని చంద్రబాబు అన్నారు. భక్తులకు టీటీడీ క్షమాపణ లు చెప్పి… వెంటనే టీటీడీ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చంద్రబాబు కోరారు.