Tuck Jagadish: తగ్గిన నానీ.. ఓటీటీలోనే టక్ జగదీష్!

కొన్ని రోజులుగా నానీ 'టక్ జగదీష్' సినిమా ఓటీటీలో వస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో నిజం లేదని ఓ పక్క నిర్మాణ సంస్థ.. మరోపక్క నాని..

Tuck Jagadish: తగ్గిన నానీ.. ఓటీటీలోనే టక్ జగదీష్!

Tuck Jagadish

Updated On : August 18, 2021 / 8:07 PM IST

Tuck Jagadish: కొన్ని రోజులుగా నానీ ‘టక్ జగదీష్’ సినిమా ఓటీటీలో వస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో నిజం లేదని ఓ పక్క నిర్మాణ సంస్థ.. మరోపక్క నాని చెబుతూనే వచ్చారు. నానీ అయితే ఈమధ్య ఓ వేడుకలో ఈ విషయంపై ఎమోషనల్ వ్యాఖ్యలు చేశారు. దీంతో టక్ జగదీష్ థియేటర్లలోనే వస్తుందని అనుకునున్నారు. కానీ.. అంతలోనే టక్ జగదీష్ అమెజాన్ ప్రైమ్ కొనేసుకుందని వార్తలొచ్చాయి. అధికారిక ప్రకటన ఒక్కటే మిగిలింది అనుకున్నారు.

ఇంతలో నానీ ఇప్పుడు ఆ వార్తలు నిజమే అనేలా ఓ లెటర్ విడుదల చేశాడు. ఇందులో టక్‌ జగదీష్‌ ఓటీటీ విడుదలపై నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నా సినిమాను థియేటర్‌లోనే విడుదల చేయలనుకున్నాను. ఎందుకంటే సినిమాను థియేటర్‌లోనే చూడటానికే నేను ఇష్టపడతా. కానీ నిర్మాతలు ఈ సినిమాకు ఎక్కువ ఖర్చు చేయడంతో వారిపై భారం పడే అవకాశం ఉంది. అందుకే మూవీ విడుదలపై మేకర్స్‌ ఒత్తిడికి గురవుతున్నారు.

Tuck Jagadish

Tuck Jagadish

అందుకే నేను వారిని ఇబ్బంది పెట్టకూడదనుని.. విడుదలపై నిర్ణయాన్ని వాళ్లకే వదిలేస్తున్నా.. అయితే టక్‌ జగదీష్‌ ఎక్కడ విడుదలైన అందరికి నచ్చుతుందని అనుకుంటున్నానంటూ చెప్పుకొచ్చాడు. గత ఏడాది నానీ నటించిన వీ సినిమా కూడా ఓటీటీలోనే విడుదల కాగా.. ఇది నానీ రెండవ సినిమా. థియేటర్లలో అయితే నానీ సినిమాకు మినిమమ్ గ్యారంటీ అనే పేరుంది. కానీ.. ఓటీటీలో వీ ఫలితంలో ఇప్పుడు టక్ జగదీష్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తిగా మారింది.

కాగా టక్‌ జగదీష్‌ను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో 37 కోట్ల రూపాయలకు మేకర్స్‌తో ఢీల్‌ కుదుర్చుకున్నట్లు ఇప్పటికే కథనాలు రాగా.. త్వరలోనే విడుదల తేదీ కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. అలాగే 8 కోట్ల రూపాలయకు శాటిలైట్‌ హక్కులను స్టార్‌ మా సొంతం చేసుకోగా.. హిందీ డబ్బింగ్‌ రైట్స్‌కు మరో రూ.5 కోట్లు, ఆడియో రైట్స్‌ను దక్కించుకునేందుకు ఆదిత్య మ్యూజిక్‌ రూ.2 కోట్లు చెల్లించినట్లు టాక్‌ నడుస్తుంది. మొత్తంగా టక్‌ జగదీష్‌ రూ.52 కోట్ల బిజినెస్‌ చేసినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.