Turmeric Crop Cultivation : మేలైన పసుపు రకాలు.. సాగు యాజమాన్యం

బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో  పెద్ద కొమ్ములను  నాటటానికి ఉపయోగిస్తుండటం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కణువుల వద్ద ముక్కలుగా కోసి ముచ్చెలను బోదెలపై విత్తుకోవాలి.

Turmeric Crop Cultivation : మేలైన పసుపు రకాలు.. సాగు యాజమాన్యం

Turmeric Crop Cultivation

Turmeric Crop Cultivation : పసుపు పంట విస్తీర్ణంలో, ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు.   దాదాపు 72వేల హెక్టార్లలో సాగుచేయబడుతూ నాలుగున్నర లక్షల టన్నుల ఉత్పత్తినిస్తోంది. ఖరీఫ్  సీజన్ కు అనుగుణంగా  పసుపు  నాటేందుకు రైతులు  సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రకాల ఎంపిక, సాగులో పెట్టుబడుల భారాన్ని తగ్గించుకుని, అధిక దిగుబడులు ఏవిధంగా తీయవచ్చో నిజామాబాద్ జిల్లా, కమ్మర్ పల్లి పసుపు పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. మహేందర్ తెలియజేస్తున్నారు.

READ ALSO : Intercrop In Papaya : బొప్పాయిలో అంతర పంటగా పసుపు సాగు

పసుపు దుంపజాతి ఉష్ణమండలపు పంట.  తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా వుంటుంది.  పసుపుసాగులో మనదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో వుండగా…దాదాపు 40శాతం సాగు విస్తీర్ణం తెలుగు రాష్ట్రాలలో వుండటం గర్వకారణం. పసుపును కేవలం వంటల్లోనే కాక వివిధ ఔషద,సుగంధ పరిశ్రమల్లోను, కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు.

READ ALSO : Turmeric Production : పసుపు తీతలో జాగ్రత్తలు.. నాణ్యమైన పసుపు ఉత్పత్తికి మెళకువలు

ఇంత ప్రాధాన్యత వున్న పసుపుసాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు, శాస్త్రీయంగా సాగుచేయాల్సి ఉంటుంది. సాధారణంగా స్వల్పకాలిక  పసుపు రకాలను ముందుగా అంటే మే రెండవ పక్షంలో నాటతారు. మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి వుంటుంది. దీర్ఘకాలిక రకాలను జూన్ 15 నుంచి నెలాఖరులోపు నాటుకోవాలి. పసపు విత్తటానికి నిర్ధేశించిన కాలం దాటిపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాధముంది.

READ ALSO : Turmeric : పసుపులో దుంప, వేరుకుళ్లు తెగులు , నివారణ చర్యలు !

ప్రస్థుతం స్వల్ప, మధ్యకాలిక రకాలు విత్తుకోవటానికి అనువైన సమయం. ప్రస్తుతం సాగు నీరు ఉండి ఉష్ణోగ్రతలు 18-35 ఉంటే ఈ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. లేదంటే జూన్ మొదటి వారంలో వర్షాలు పడ్డాకా విత్తుకోవాలని నిజామాబాద్ జిల్లా, కమ్మర్ పల్లి పసుపు పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. మహేందర్  సూచిస్తున్నారు.  సాధారణంగా రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ళ వరకు విత్తనాన్ని వాడుతుంటారు.

READ ALSO : Turmeric Cultivation : పసుపు సాగులో విత్తనశుద్ధి, పోషక ఎరువుల విషయంలో యాజమాన్య పద్ధతులు!

బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో  పెద్ద కొమ్ములను  నాటటానికి ఉపయోగిస్తుండటం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది. ఇలా కాకుండా పెద్ద కొమ్ములను కణువుల వద్ద ముక్కలుగా కోసి ముచ్చెలను బోదెలపై విత్తుకోవాలి. తద్వారా ఎకరాకి 4 క్వింటాల వరకు విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. అంతే కాదు దుక్కిలోనే శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా ఎరువులను వేయాలి.