Twitter Flock Feature : ఇన్‌స్టా మాదిరిగా ట్విట్టర్‌లో సరికొత్త ఫీచర్.. గ్రూపుల్లోనూ షేర్ చేయొచ్చు..!

ప్రఖ్యాత సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్ లో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇతర సోషల్ ప్లాట్ ఫాం మాదిరిగానే షేరింగ్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది.

Twitter Flock Feature : ఇన్‌స్టా మాదిరిగా ట్విట్టర్‌లో సరికొత్త ఫీచర్.. గ్రూపుల్లోనూ షేర్ చేయొచ్చు..!

Twitter 'close Friends' Fea

Twitter Flock Feature : ప్రఖ్యాత సోషల్ మీడియా కంపెనీ ట్విట్టర్ లో కొత్త ఫీచర్ రాబోతోంది. ఇతర సోషల్ ప్లాట్ ఫాం మాదిరిగానే షేరింగ్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ ‘క్లోజ్ ఫ్రెండ్స్’ ఫీచర్‌తో పనిచేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మాదిరిగా యూజర్లు తమ స్టోరీలను షేర్ చేసుకోవడానికి close friends లిస్టును ఎంపిక చేసుకోవచ్చు. ట్విట్టర్ కూడా ఇదే తరహా ఫీచర్‌ను త్వరలో తీసుకురానుంది. ట్విట్టర్ యూజర్లు తమ ట్వీట్‌లను గ్రూపుల్లో షేర్ లేదా ఫ్లాక్ చేసేందుకు అనుమతిస్తుంది.

గత ఏడాది జూలైలో ట్విట్టర్ ఈ ఫీచర్‌కి సంబంధించి మోడల్ షేర్ చేసింది. దీనిని ‘ట్రస్టెడ్ ఫ్రెండ్స్’గా పిలుస్తారు. మొబైల్ డెవలపర్ అలెశాండ్రో పలుజ్జీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల ఈ కొత్త ఫీచర్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయని డెవలపర్ అలెశాండ్రో ట్వీట్ చేశారు. Twitter గ్రూపు ఎలా పని చేస్తుందో.. దానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని పేజీలో అందించనుంది.

ట్విట్టర్ యూజర్లు తమ గ్రూపు జాబితాలో గరిష్టంగా 150 మంది సభ్యులను యాడ్ చేసుకోవచ్చు. మీరు మీ ట్వీట్‌ను మీ గ్రూపుతో భాగస్వామ్యం చేసుకోవచ్చు. ఈ జాబితాలో భాగమైన యూజర్లు మాత్రమే ట్వీట్‌ను చూడగలరు. రీట్వీట్ చేయగలరు. యూజర్లు తమ ఫ్లాక్ నుంచి యూజర్లను ఎప్పుడైనా ఏ సమయంలోనైనా తొలగించవచ్చు.

అలా తొలగించిన యూజర్లకు ఎలాంటి నోటిఫికేషన్ రాదు. మీరు గ్రూపులో ఉండి ఏదైనా ట్వీట్‌ను షేర్ చేస్తే.. ట్వీట్ కింద లేబుల్ కనిపించవచ్చు. తద్వారా Twitterలో మీరు ఫాలో అయ్యే ఇతర యూజర్లకు మీ ఫ్రెండ్స్ మధ్య తేడాను గుర్తించవచ్చు. ఒక ట్వీట్‌ను పంపేముందు యూజర్లు ఎవరెరవని ఎంపిక చేసుకోవాలో ఆప్షన్ కూడా చూడవచ్చు.

స్నేహితులు, ఇతర ట్విట్టర్ యూజర్ల మధ్య ట్వీట్‌లను సపరేటు చేయడంలో భాగంగా ట్విట్టర్ కొత్త ఫీచర్ కోసం ప్లాన్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది సెప్టెంబరులో Invite Only అనే కమ్యూనిటీలను ప్రవేశఫెట్టింది. యూజర్ల భాగస్వామ్యంతో ఇతరులతో కనెక్ట్ చేయడానికి అనుమతించింది.

Twitter కమ్యూనిటీల ఫీచర్‌తో.. యూజర్లు తమ ట్వీట్‌లను అన్ని ఫాలోవర్లకు బదులుగా నిర్దిష్ట కమ్యూనిటీతో మాత్రమే షేర్ చేసుకోవచ్చు. Twitter Flock ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. Twitter ఈ ఫీచర్ యూజర్ల అందరికి అందజేస్తుందా లేదా ప్రత్యేకమైన/పేమెంట్ యాక్సెస్ ద్వారా అందిస్తుందా క్లారిటీ లేదు. ‘ట్విట్టర్ ఫ్లాక్’ అనేది కేవలం ప్లేస్‌హోల్డర్ పేరు మాత్రమేనని ట్విట్టర్ ప్రతినిధి టటియానా బ్రిట్ ది వెర్జ్‌తో అన్నారు.

Read Also : Tollywood Star Hero’s: బ్యాక్ టూ బ్యాక్ మూవీస్.. ఆగేదే లేదంటున్న స్టార్ హీరోలు!