Tea Coffee : రోజుకు రెండు కప్పుల టీ, కాఫీ….గుండెకు మంచిదా?

కాఫీ అయినా, టీ అయినా వాటిలో ఉండే వివిధ పదార్ధాలు మన మెదడులోని రసాయనికి మార్పులకు కారణమౌతాయి. దీంతో ఉత్సాహం, చురుకుదనం వస్తుంది.

Tea Coffee : రోజుకు రెండు కప్పుల టీ, కాఫీ….గుండెకు మంచిదా?

Dark Turkish Coffee On The Table

Tea Coffee : మన దైనందిన జీవితంలో కాఫీ, టీలు భాగంగా మారిపోయాయి. టీ,కాఫీలు తాగకపోతే చాలా మందిలో ఎదో మిస్సైన ఫీలింగ్ కలుగుతుంది. ఇంకొందరైతే ఏకంగా రోజుకు నాలుగైదుసార్లు అయిన టీ లేదా కాఫీ తాగుతుంటారు. టీ, కాఫీ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అలవాటు. ఎక్కువ సార్లు టీ, కాఫీలు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు ఒక వైపు హెచ్చరిస్తుండగా మరొవైపు రోజులో 2-3 కప్పులకు మించకుండా తాగటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

కాఫీ అయినా, టీ అయినా వాటిలో ఉండే వివిధ పదార్ధాలు మన మెదడులోని రసాయనికి మార్పులకు కారణమౌతాయి. దీంతో ఉత్సాహం, చురుకుదనం వస్తుంది. వీటిలో ఉండే కేలరీల వల్ల శరీరానికి శక్తి కూడా అందుతుంది. పని వత్తిడి, అలసటతో ఉన్నవారు తరచూ టీ, కాఫీలను తీసుకుంటుంటారు. టీ, కాఫీలలో ఉండే రసాయనాలు శరీరానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల మానసిక స్థితి బాగుంటుంది.. బ్రిటన్‌లో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, సరైన మోతాదులో కాఫీ, టీ తాగడం వల్ల స్ట్రోక్, డిమెన్షియా,రొమ్ము క్యాన్సర్, కాలేయం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అకాశం తగ్గుతుంది.

ఇదే విషయంపై 3.65 లక్షల మంది బ్రిటిష్ పౌరులపై ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం వివరాలను పీఎల్‌ఓఎస్‌ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ పరిశోధనలో 50-74 సంవత్సరాల వయసు వారి టీ, కాఫీ అలవాట్లపై అధ్యయనం జరిపారు. రోజూ 2-3 కప్పుల కాఫీ, 2-3 కప్పుల టీ తాగేవారిలో స్ట్రోక్ ముప్పు 32 శాతం తక్కువగా ఉన్నట్లు పరిశోధనలో కనుగొన్నారు. ఇలాంటి వారిలో చిత్తవైకల్యం వచ్చే ప్రమాదం 28 శాతం తక్కువగా ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. సరైన మోతాదుతో లాభం కలుగుతుందని పరిశోధకులు ప్రకటించారు. టీ, కాఫీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, అధిక రక్తపోటు, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుందని పరిశోధకులు తేల్చారు.