North Korea: కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరకొరియా నిన్న హ్వాసాంగ్-15 ఖండాంతర క్షిపణి పరీక్ష నిర్వహించింది. దీంతో అమెరికా, దక్షిణ కొరియా అప్రమత్తమై ఇవాళ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. దీనిపై దక్షిణ కొరియా సైనిక అధికారులు ఓ ప్రకటన చేశారు.

North Korea: కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

North Korea's History That 8 Missiles Have Been Fired In A Single Day

North Korea: కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరకొరియా నిన్న హ్వాసాంగ్-15 ఖండాంతర క్షిపణి పరీక్ష నిర్వహించింది. దీంతో అమెరికా, దక్షిణ కొరియా అప్రమత్తమై ఇవాళ సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి. దీనిపై దక్షిణ కొరియా సైనిక అధికారులు ఓ ప్రకటన చేశారు.

సంయుక్త సైనిక విన్యాసాల్లో దక్షిణ కొరియాకు చెందిన ఎఫ్-35ఏ, ఎఫ్-15కే యుద్ధ విమానాలు, అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాలు, బీ-1బీ బాంబర్లు పాల్గొన్నాయని చెప్పారు. తమ శక్తిసామర్థ్యాలను, యుద్ధ సంసిద్ధతను చూపేందుకే ఈ విన్యాసాలు చేపట్టామని అన్నారు. దక్షిణ కొరియా మళ్లీ క్షిపణి ప్రయోగాలు చేస్తుండడంతో యుద్ధ భయం నెలకొంది.

ఉత్తర కొరియా చర్యలను ఉపేక్షించబోమని దక్షిణ కొరియా మిలటరీ అధికారులు అంటున్నారు. దక్షిణ కొరియా-అమెరికా కొన్ని వారాల క్రితం కూడా పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపట్టాయి. ఉత్తర కొరియా అణ్వాయుధ పరీక్షలు చేపట్టనుందని కొన్ని నెలల క్రితం అమెరికా నిఘా వర్గాలు తమ నివేదికల్లో తెలపడంతో అమెరికా-జపాన్-దక్షిణ కొరియా అప్రమత్తంగా ఉన్నాయి. అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త విన్యాసాలు చేపడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంటూ ఉత్తర కొరియా పలుసార్లు హెచ్చరించింది.

Viral Video: స్కూలు బస్సులో ఏడో తరగతి విద్యార్థిపై మరో విద్యార్థి దాడి