Viral Video: స్కూలు బస్సులో ఏడో తరగతి విద్యార్థిపై మరో విద్యార్థి దాడి

అమెరికాలోని వర్జీనియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూలు బస్సులో ఏడో తరగతి విద్యార్థిపై దాడి చేశాడు మరో విద్యార్థి. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా అక్కడి మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. బస్సులో తన కుమారుడిపై ఓ బాలుడు దాడి చేశాడని, ఊపిరి ఆడకుండా గొంతు పట్టుకున్నాడని బాధిత విద్యార్థి తల్లి మీడియాకు చెప్పారు.

Viral Video: స్కూలు బస్సులో ఏడో తరగతి విద్యార్థిపై మరో విద్యార్థి దాడి

Student choking 7th-grader

Updated On : February 19, 2023 / 3:55 PM IST

Viral Video: అమెరికాలోని వర్జీనియాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్కూలు బస్సులో ఏడో తరగతి విద్యార్థిపై దాడి చేశాడు మరో విద్యార్థి. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా అక్కడి మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. బస్సులో తన కుమారుడిపై ఓ బాలుడు దాడి చేశాడని, ఊపిరి ఆడకుండా గొంతు పట్టుకున్నాడని బాధిత విద్యార్థి తల్లి మీడియాకు చెప్పారు.

ఆ బాలుడి మెడ, ముఖంపై గాయాలు కనపడుతున్నాయి. ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ పబ్లిక్ స్కూల్స్ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ స్కూలు యాజమాన్యం ఈ ఘటన పట్ల సరైన రీతిలో స్పందించడం లేదని బాధిత విద్యార్థి తల్లి టేలర్ బ్రాక్ తెలిపారు. ఈ ఘటనను తక్కువ చేసి చూపించడానికి స్కూలు సిబ్బంది ప్రయత్నిస్తున్నారని అన్నారు.

స్కూలు బస్సులో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగినప్పుడు మరో విద్యార్థి స్మార్ట్ ఫోన్ లో వీడియో తీశాడు. బస్సులో దాడి ఘటన నేపథ్యంలో ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ పబ్లిక్ స్కూల్స్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.