KTR Vs Kishan Reddy : ఆరు నెలల్లోపు తెలంగాణలో ఎన్నికలు ఖాయం..ఈలోగా కేటీఆర్ మంత్రిగా ఉంటే ఏంటీ ఊడితే ఏంటీ? : కిషన్ రెడ్డి

ఆరు నెలల్లోపు తెలంగాణలో ఎన్నికలు ఖాయం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ..ఈలోగా కేటీఆర్ మంత్రిగా ఉంటే ఏంటీ ఊడితే ఏంటీ? అంటూ ఎద్దేవా చేశారు.

KTR Vs Kishan Reddy : ఆరు నెలల్లోపు తెలంగాణలో ఎన్నికలు ఖాయం..ఈలోగా కేటీఆర్ మంత్రిగా ఉంటే ఏంటీ ఊడితే ఏంటీ? : కిషన్ రెడ్డి

KTR Vs Kishan Reddy

KTR Vs Kishan Reddy :  కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల విషయంలో అన్ని ఆధారాలతోను చర్చకు సిద్ధంగా ఉన్నామని మీరు సవాల్ చేసినట్లుగా రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని ముఖ్యంగా కేసీఆర్ రాజీనామా పత్రం సిద్ధం చేసుకుని చర్చకు రావాలంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేటీఆర్ కు సవాల్ విసిరారు.

అదే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలకు సవాల్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కౌంటర్ ఇస్తూ..నేను రాజీనామా చేస్తాను అంటూ కేటీఆర్ తెగ బీరాలు పోతున్నారు..మరో ఆరు నెలలు లోపే తెలంగాణలో ఎన్నికలు జరగటం ఖాయం. ఇక నువ్వు రాజీనామా చేస్తే ఎంత చేయకపోతే ఎంత? ఎలాగూ బీఆర్ఎస్ ఓడటం ఖాయం..బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావటం పక్కా ఇక నువ్వు రాజీనామా చేస్తే ఎంత చేయకపోతే ఎంత అంటూ ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి.

KTR Vs Bandi Sanjay : చర్చకు రె‘ఢీ’..కేసీఆర్‌ను రాజీనామా పత్రం రాసుకుని రమ్మను కేటీఆర్ : బండి సంజయ్

అయినా కేటీఆర్ ను రాజీనామా చేయమని ఎవరు అడిగారు? వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయం ఇక నువ్వు మంత్రిగా ఉంటే ఎంత ఊడితే ఎంత? తెలంగాణ ప్రజలే కేటీఆర్ తో రాజీనామా చేయించి తీరుతారు అంటూ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఇంక ఆరు నెలలే కేసీఆర్ పాలన ఇక కేసీఆర్ శాశ్వతంగా తన ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవచ్చు..ఆరోజులు త్వరలోనే రానున్నాయి అంటూ ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి.

Telangana : టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారినా మా జెండా,అజెండా,డీఎన్ఏ మారదు : కేటీఆర్

కాగా..శుక్రవారం (జనవరి 6,2023) సూర్యాపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కేంద్రం తెలంగాణాకు ఇచ్చిన నిధుల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసురుతూ కేంద్రానికి తెలంగాణ రూ.3లక్షల 68వేల కోట్ల పన్నులు చెల్లించామని కానీ కేంద్రం మాత్రం తెలంగాణకు ఇచ్చింది కేవలం రూ. లక్షా 68వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు న్యాయంగానే నిధులు ఇస్తోంది అంటూ మంత్రి కిషన్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని మీరు చెప్పేది నిజమైతే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను..నేను చెప్పేది నిజమని తేలితే మీ మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి చెప్పేది అబద్ధమని తేలితే మీరు రాజీనామా చేయకపోయినా ఫరవాలేదు కానీ తెలంగాణ ప్రజలకు ఆయన క్షమాపణలు చెబుతారా? అంటూ సవాల్ విసిరారు.