Traffic Constable Cries: పోలీస్ స్టేషన్‌లో కన్నీళ్లు పెట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఎందుకంటే

పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని, ఉన్నావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉన్నావ్ పట్టణంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు.

Traffic Constable Cries: పోలీస్ స్టేషన్‌లో కన్నీళ్లు పెట్టుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్.. ఎందుకంటే

Traffic Constable Cries

Traffic Constable Cries: పోలీస్ స్టేషన్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని, ఉన్నావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉన్నావ్ పట్టణంలో ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన అనుచరులు ఉన్న వాహనం అటుగా వెళ్లింది. ఆ వాహనానికి సైరన్ ఉండటంతో, కానిస్టేబుల్ వాహనాన్ని ఆపి, చలానా విధించాడు. దీంతోపాటు వాహనాన్ని ఫొటోలు కూడా తీశాడు. ఈ పని ఎమ్మెల్యే అనుచరులకు కోపం తెప్పించింది. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను తిట్టడంతోపాటు, బెదిరించారు.

Uttar Pradesh : పీడకలలు వస్తున్నాయని చోరీ చేసిన విగ్రహాలు తిరిగి ఇచ్చేసిన దొంగలు

అలాగే తాము పోలీస్ స్టేషన్‌కు వెళ్లే వరకు తమ వెనకే రావాలని ఆదేశించారు. అందరూ కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ స్టేషన్ ఇన్‌చార్జ్ ఓపీ రాయ్ కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్‌నే తప్పుబట్టాడు. వాహనాన్ని ఎందుకు ఆపావంటూ ప్రశ్నించాడు. అయితే, జరిగిన విషయాన్ని కానిస్టేబుల్ చెప్పే ప్రయత్నం చేశాడు. బీజేపీ లీడర్లే తనను బెదిరించారని, అవమానించారని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ ఆవేదనతో పోలీస్ స్టేషన్‌లోనే ఏడ్చాడు. నాయకులంతా కూర్చొని ఉంటే, కానిస్టేబుల్ నిలబడి, కన్నీళ్లు పెట్టుకుంటూ తన వాదన వినిపిస్తున్న దృశ్యాన్ని అక్కడి వారు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఐజీ లక్ష్మీ సింగ్, ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను వేధించిన నిందితులపై కేసు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు.