Bicycles: వలస కూలీల సైకిళ్ల వేలం… 21 లక్షల ఆదాయం

2020 లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీంతో చాలా మంది కాలి నడకన, సైకిళ్ల మీద సొంతూళ్లకు తరలి వెళ్లారు.

Bicycles: వలస కూలీల సైకిళ్ల వేలం… 21 లక్షల ఆదాయం

Bicycles: రెండేళ్లక్రితం లాక్‌డౌన్ విధించిన సమయంలో కూలీలు వదిలి వెళ్ళిన సైకిళ్లను వేలం వేసింది యూపీ ప్రభుత్వం. మొత్తం 5,400 సైకిళ్లకుగాను, రూ.21 లక్షల ఆదాయం వచ్చింది. 2020 లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీంతో చాలా మంది కాలి నడకన, సైకిళ్ల మీద సొంతూళ్లకు తరలి వెళ్లారు.

Ganta Srinivasa Rao: ప్రభుత్వ చేతకానితనంతోనే పరీక్షా ఫలితాల విడుదల వాయిదా: గంటా శ్రీనివాసరావు

ఇలాంటి పరిస్థితుల్లో కొందరు తమ సైకిళ్లను ఉత్తర ప్రదేశ్‌లోని సహరణ్ పూర్‌లో వదిలి వెళ్లాల్సి వచ్చింది. సహరణ్ పూర్‌ జిల్లా కేంద్రం అనేక రాష్ట్రాలకు వెళ్లేందుకు మెయిన్ సెంటర్‌గా ఉంది. ఇక్కడి నుంచి హరియాణా, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లొచ్చు. దీంతో చాలా మంది కూలీలు సైకిళ్ల మీద ఇక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో కోవిడ్ ఎక్కువగా ఉండటంతో అధికారులు, కూలీలకు స్థానిక రాధాస్వామి సత్సంగ్ ఆశ్రమంలో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అధికారులు బస్సులు, ఇతర రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి కూలీలను సొంత ఊళ్లకు తరలించారు. ఈ సమయంలో సైకిళ్లను అక్కడే వదిలి వెళ్లాల్సిందిగా సూచించారు. సైకిళ్లు విడిచి వెళ్లే వాళ్లకు టోకెన్లు కూడా ఇచ్చారు. దాదాపు 14,600 మంది తమ సైకిళ్లను అక్కడే వదిలేసి వెళ్లారు.

Arvind Kejriwal: కాశ్మీర్‌పై రాజకీయాలు చేయడమే బీజేపీకి తెలుసు: అరవింద్ కేజ్రీవాల్

కొంత కాలం తర్వాత చాలా మంది తిరిగొచ్చి, టోకెన్లు చూపించి తమ సైకిళ్లు తీసుకెళ్లారు. అయితే, రెండేళ్లు గడుస్తున్నా ఇంకొందరు సైకిళ్లను తీసుకెళ్లలేదు. దీంతో సుమారు 5,400 సైకిళ్లు అలాగే ఉండిపోయాయి. పైగా ఎండకు ఎండి, వానకు తడిసి చాలా వరకు పాడయ్యాయి. సైకిళ్లు రెండేళ్లైనా అలాగే ఉండిపోతుండటంతో, అధికారులు వాటిని వేలం వేయాలని భావించారు. అలా మొత్తం సైకిళ్లను అధికారులు వేలం వేయగా 21.2 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.