ఉమ్మి ఊసి చపాతీలు చేస్తున్న వైనం..పెళ్లి విందులో గలీజు పని

ఉమ్మి ఊసి చపాతీలు చేస్తున్న వైనం..పెళ్లి విందులో గలీజు పని

spitting on rotis at a wedding function : మెత్తగా..వేడి వేడిగా ఉండే చపాతీలు ఒక్కో ముక్కా తెంచుకుని నోట్లో పెట్టుకుని తింటే భలేగుంటుంది. చపాతీలు తింటే మంచి ఆరోగ్యం కూడాను..అదే ఓ పెళ్లి విందుకు వెళ్లి చపాతీలు తింటే అదీ కూడా రెండు మూడు రకాల కూరలు వేసుకుని తింటే నాలుగైదు చపాతీలు లాగించేయొచ్చు. కానీ ఆ చపాతీలను ‘ఉమ్మి’వేసి తయారు చేశారని తెలిస్తే ఎలా ఉంటుంది?!! ఏంటీ ఊహించటానికి వెగటు పుడుతోందా? అసలు అలా ఎవరైనా ‘ఉమ్మి’వేసి చేస్తారా? అనే డౌట్ కూడా రావచ్చు.

కానీ ఇది నిజం..ఓ పెళ్లి విందులో ఏర్పాటు చేసిన చపాతీల్లో ఆ చపాతీలు చేసే వ్యక్తి ప్రతీ చపాతీ కాల్చేటప్పుడు తన నోటిలోంచి ‘ఉమ్మి’వేసి మరీ తయారు చేసిన వీడియో బైటపడింది. దీంతో అది చూసివారంతా తెగ తిట్టిపోస్తున్నారు. ఇక ఆ పెళ్లికి వెళ్లి చపాతీలు తిన్నవారి పరిస్థితి ఏంటోమరి..వారి మానసిక పరిస్థితి ఊహించుకోండీ..అసలు అలా చెయ్యాలనే దుర్మార్గపు అసహ్యమైన ఆలోచన అతనికి ఎందుకు వచ్చిందోనని తిట్టిపోస్తున్నారు జనాలు.

ఉత్తరప్రదేశ్‌… మీరట్‌లో జరిగిన ఓ పెళ్లి విందులో ఓ యువకుడు రోటీలు (చపాతీలు) తయారుచేస్తూ… వాటిపై ఉమ్మి వేస్తున్నాడు. ప్రతీ చపాతీపైనా ఉమ్మి వేశాడు. చపాతీలను చాక చక్యంగా తిప్పుతూ ఒకదానిమీద మరొకటి పేర్చి ప్రతీ చపాతీపై ఉమ్మి ఊసి పేరుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసినవారంతా అతడిని తిట్టిపోస్తున్నారు. ఇక ఆ పెళ్లికి హాజరై చపాతీలు తిన్నవారి పరిస్థితి ఏంటాని వాపోతున్నారు.

ఛీచీ ఇటువంటివారిని క్యాటరింగుల్లో పెట్టుకోకూడదని తిట్టిపోస్తున్నారు. ఇలాంటి వాళ్లని అస్సలు వదలకూడదని డిమాండ్ చేస్తున్నారు. అదే జరిగింది. ఆ వీడియో వైరల్ అయ్యీ అయ్యీ పోలీసుల దాకా వెళ్లింది. పై అధికారుల నుంచి కింది పోలీసులకు కాల్స్ వచ్చాయి. విషయం తేల్చాలని ఆదేశాలు కూడా వచ్చాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు ప్రబుద్ధిడి కోసం దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు ఆ పెళ్లి వేడుకకు సంబంధించినవారి వద్దకు వెళ్లి వాళ్లకు క్యాటరింగ్ ఎవరు చేశారో తెలుసుకున్నారు. అలా ఆ క్యాటరింగ్ లో చపాతీలు చేసింది ఎవరో ఎంక్వైరీ చేశారు. అలా చివరకు ఆ ప్రబుద్ధుడు ఎవరో కనిపెట్టగా ఆ యువకుడి పేరు నౌషద్ అని తెలిసింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తీసుకెళ్లి విచారణ ప్రారంభించారు.

ఎందుకలా గలీజుగా చపాతీలమీద ఉమ్మి వేసి చేస్తున్నావు? అని ప్రశ్నించగా అతని చెప్పిన సమాధానం విన్న పోలీసులు షాక్ అయ్యారు. ‘‘నేనసలు ఇప్పుడే కాదు ఎప్పుడూ చపాతీలే చెయ్యలేదనీ… తనకేమీ తెలియదని..ఎవరో కావాలని నాపై కక్ష కట్టి ఇలా ఇరికించారని బొంకుతున్నాడు. కానీ వీడియోలో ఆధారాలు చూపించినా ఆ వీడియోలో ఉన్నది నేను కాదని వాదనే చేస్తున్నాడు. దీంతో పోలీసులు నౌషద్ కు మానసిక సమస్యలు ఉన్నాయోమోనని అనుమాన పడుతున్నారు.