Upasana : పిల్లలు, ప్రెగ్నెన్సీపై ఉపాసన వ్యాఖ్యలు.. పిల్లలు లేకపోయినా పర్లేదు అన్న సద్గురు..

తాజాగా ఇషా ఫౌండేషన్‌ స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు నిర్వహిస్తున్న సేవ్ సాయిల్ కార్యక్రమంలో ఉపాసన పాల్గొనగా పిల్లలు అంశంపై మాట్లాడారు. దీనికి సద్గురు సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో......

Upasana : పిల్లలు, ప్రెగ్నెన్సీపై ఉపాసన వ్యాఖ్యలు.. పిల్లలు లేకపోయినా పర్లేదు అన్న సద్గురు..

Upasana

Upasana :  సెలబ్రిటీల విషయంలో జనాలు అత్యుత్సాహంతో ఉంటారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ విషయాల గురించి ఎక్కువగా ఆరా తీస్తారు. ముఖ్యంగా పెళ్లి, పిల్లలు. మెగా ఫ్యామిలీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలైంది. అయితే ఇప్పటికి వీరికి పిల్లలు లేరు. ప్రతి సారి చాలా మంది ఉపాసనని పిల్లలు ఎప్పుడు అని అడుగుతూ ఉంటారు. దీనిపై ఉపాసన ఇప్పటివరకు స్పందించలేదు.

తాజాగా ఇషా ఫౌండేషన్‌ స్థాపకులు, ఆధ్యాత్మిక గురువు సద్గురు నిర్వహిస్తున్న సేవ్ సాయిల్ కార్యక్రమంలో ఉపాసన పాల్గొనగా పిల్లలు అంశంపై మాట్లాడారు. దీనికి సద్గురు సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాసన మాట్లాడుతూ.. ”మా పెళ్లై పదేళ్లయింది. నా వివాహ బంధం చాలా ఆనందంగా ఉంది. కానీ కొంతమంది నా RRR (రిలేషన్‌షిప్‌, రీప్రొడ్యూస్‌, రోల్‌ ఇన్‌ మై లైఫ్‌) గురించి అడుగుతూ ఉంటారు. పిల్లలు ఎప్పుడు కంటావని ప్రశ్నిస్తారు. ఈ పరిస్థితి నా ఒక్కదానికే కాదు చాలా మంది మహిళలకు ఎదురవుతోంది’’ అని తెలిపింది.

Bimbisara : కళ్యాణ్ రామ్ ‘బింబిసార 2’లో ఎన్టీఆర్.. జోష్ లో నందమూరి అభిమానులు..

దీనికి సద్గురు మాట్లాడుతూ.. ”రీప్రొడక్షన్‌ విషయానికొస్తే.. పిల్లలు కనకుండా ఉంటే నేను కచ్చితంగా అవార్డు ఇస్తా. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు కనకుండా ఉండటమే దేశానికి సేవ చేసినట్టు. ఒకవేళ మీరు పులి అయితే పిల్లలు కనమని చెప్పేవాడ్ని. ఎందుకంటే పులులు అంతరించిపోతున్నాయి కాబట్టి. కానీ మనుషులు రోజులు రోజుకి పెరుగుతున్నారు తప్ప అంతరించిపోవట్లేదు. ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణి అద్భుతమే. రాబోయే 30- 35 సంవత్సరాల్లో ప్రపంచ జనాభా 10 బిలియన్లకు చేరుకుంటుంది. దాని వల్ల ఎన్నో మార్పులు వస్తాయి. ఉండటానికి చోటు కూడా ఉండదు, పర్యావరణ విపత్తు ఏర్పడుతుంది. మనసు పెట్టి ఆలోచిస్తే జనాభా తగ్గించటం కరెక్ట్ అనిపిస్తుంది. మనం కంట్రోల్ లో ఉండకపోతే భవిష్యత్తులో మరింత మంది మనుషుల అడుగులు భూమి మీద పడతాయి. అలాంటి అవకాశం ఇవ్వకూడదు అంటే పిల్లలు కనని వాళ్ళకి అవార్డులు ఇవ్వాలి. నేనైతే అదే చేస్తున్నా” అని అన్నారు.

దీనికి ఉపాసన సరదాగా సమాధానమిస్తూ.. అయితే మీకు మా అమ్మ, అత్తయ్య నుంచి కాల్‌ వస్తుంది అనగా సద్గురు.. నాకు రోజూ అలాంటి కాల్స్ వస్తాయి అని చెప్పి నవ్వేశారు. మొదటిసారి ఉపాసన పిల్లల గురించి మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.